deepika padukune
-
హీరోయిన్లా మజాకా.. యాక్షన్ తగ్గేదే లే!
ఒకరు తుపాకీ పట్టుకున్నారు.. ఇంకొకరు ఫ్లయిట్ ఎక్కారు... ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. ‘యాక్షన్‌కి సై’ అంటూ బరిలోకి దిగారు. ప్రత్యర్థులను రఫ్ఫాడారు. సుకుమారంగా కనిపించే కథానాయికలు రఫ్‌గా మారిపోయి, విలన్లను ఇరగదీశారు. సమంత, త్రిష, కీర్తీ సురేశ్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, ఆలియా భట్, కృతీ సనన్ వంటి నాయికలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో యాక్షన్ రోల్స్ చేస్తున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం. పవర్ఫుల్ రీటా ఓ వైపు హీరోయిన్గా అగ్రహీరోల సరసన నటిస్తూనే మరోవైపు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో మెప్పిస్తున్నారు కీర్తీ సురేశ్. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘రివాల్వర్ రీటా’. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, థ్రిల్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో రెండు చేతుల్లో రెండు రివాల్వర్స్ పట్టుకుని ఉన్న కీర్తి పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలకానుంది. కాగా ‘సైరన్, రఘు తాత, కన్ని వెడి’ వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు కీర్తీ సురేశ్. వీటిలో ‘కన్ని వెడి’ లేడీ ఓరియంటెడ్ మూవీ. ‘రఘు తాత’ కూడా దాదాపు ఇలాంటి సినిమానే. ఇక చిరంజీవి చెల్లెలిగా కీర్తి నటించిన ‘భోళా శంకర్’ ఈ 11న విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలీ టు హాలీవుడ్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన షారుక్ ఖాన్ ‘పఠాన్’ మూవీలో యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టిన దీపిక ప్రస్తుతం ‘ఫైటర్’, ‘సింగం 3’ వంటి చిత్రాల్లో యాక్షన్ రోల్స్‌కి సై అన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్’ కోసం ప్రత్యేకంగా స్టంట్స్‌లో శిక్షణ తీసుకున్నారు దీపిక. అలాగే ‘సింగం’ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగం 3’ రూపొందనుంది. ‘సింగం’, ‘సింగం 2’ చిత్రాలు తెరకెక్కించిన రోహిత్ శెట్టి దర్శకత్వంలోనే ‘సింగం 3’ తెరకెక్కనుంది. ఈ మూడో భాగం హీరోయిన్ ఓరియంటెడ్‌గా సాగనుందట. ఇందులో దీపికా పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే ఓ హాలీవుడ్ మూవీలో ఏజెంట్‌గా కనిపించనున్నారట దీపిక. ఈ చిత్రంలోనూ ఆమె యాక్షన్ సీన్స్ చేయనున్నారని భోగట్టా. ఇలా బాలీవుడ్ టు హాలీవుడ్ యాక్షన్ రోల్స్ సైన్ చేసి జోరుగా దూçసుకెళుతున్నారు దీపికా పదుకోన్. టైగర్‌తో యాక్షన్ సల్మాన్ ఖాన్‌కి సమానంగా కాకపోయినా తనదైన శైలిలో ఫైట్స్ చేశారు కత్రినా కైఫ్. ‘టైగర్’ ఫ్రాంచైజీలో భాగంగా సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో దర్శకుడు మనీష్ శర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టైగర్ 3’. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్. హీరో హీరోయిన్లు ఇద్దరూ గూఢ చారుల పాత్రల్లో నటిస్తున్నారట. ఐఎస్ఐ ఏజెంట్ జోయా పాత్రలో కత్రినా కనిపించనున్నారని సమాచారం. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో జోయాగా కత్రినా చేసిన ఫైట్స్ హైలైట్‌గా ఉంటాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ ఫైట్స్ కోసం ప్రత్యేకించి సౌత్ కొరియాకు చెందిన స్టంట్ మాస్టర్ల దగ్గర 14 రోజులు శిక్షణ తీసుకున్నారట కత్రినా. ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ కానుంది. యుద్ధ విమానం ఎక్కి.. దాదాపు లేడీ ఓరియంటెండ్ సినిమాలకే పరిమితమయ్యారు కంగనా రనౌత్. సర్వేష్ మేవారా దర్శకత్వంలో ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘తేజస్’. ఈ చిత్రంలో ఆమె యుద్ధ విమానాలు నడిపే పైలెట్ పాత్ర చేశారు. కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్‌గా రూపొందిన ఈ చిత్రం కోసం పలు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నారు కంగన. ఇందుకోసం దాదాపు నాలుగు నెలల పాటు ఆమె శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంచితే.. కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ చిత్రం నిర్మించారు. భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ (1975–1977) ఎందుకు విధించారు? ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అనే అంశంతో ‘ఎమర్జెన్సీ’ని తెరకెక్కించారు. ఇందిరా గాంధీగా కంగన నటించిన ఈ చిత్రం నవంబరు 24న విడుదల కానుంది. అలాగే పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా కంగన టైటిల్ రోల్లో రూపొందిన ‘చంద్రముఖి 2’ సెప్టెంబరు 19న విడుదల కానుంది. హాలీవుడ్లో యాక్షన్ అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ ఆలియా భట్ కూడా యాక్షన్‌కి సై అన్నారు. టామ్ హార్పర్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో ఆలియా కీలక పాత్ర చేశారు. స్పై యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు ఆలియా భట్. ఈ నెల 11న ఈ సినిమా విడుదల కానుంది. బైక్‌పై దూసుకెళుతూ... ఇటీవల విడుదలైన ‘ఆది పురుష్’లో సుకుమారి సీతగా కనిపించిన కృతీ సనన్ ఇప్పుడు అందుకు పూర్తి విభిన్నంగా రూడ్‌గా మారిపోయారు. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘గణ్పథ్: పార్ట్ 1’లో ఆమె పవర్ఫుల్ రోల్ చేశారు. ఈ సినిమా కోసం కృతి అద్భుతమైన బైక్ స్టంట్స్ చేశారు. ఇందుకోసం బైక్ స్టంట్స్ నేర్చుకున్నారామె. అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కానుంది. ఇంతేనా.. ఇంకొందరు కథానాయికలు యాక్షన్ రోల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తామేంటో నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు. వెబ్‌లో యాక్షన్ కొందరు కథానాయికలు వెండితెరపై యాక్షన్ రోల్స్ చేస్తుంటే త్రిష, సమంత వంటి తారలు వెబ్ సిరీస్‌లో ఈ తరహా పాత్రలు చేస్తున్నారు. రెండు దశాబ్దాల కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించిన త్రిష తొలిసారి ‘బృందా’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. సూర్య వంగల్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో త్రిష ఓ పవర్ పోలీసాఫీసర్ పాత్ర చేశారు. త్రిషలోని మాస్ ఇమేజ్‌ని బలంగా చూపించే పాత్ర ఇది. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఆ మధ్య వరుసగా హీరోల సరసన నటించిన సమంత ఇటీవల లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ బ్యూటీ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్ 2’. దర్శక ద్వయం రాజ్–డీకే తెరకెక్కించిన ఈ సిరీస్‌లో సమంత యాక్షన్ రోల్లో అదరగొట్టారు. ప్రస్తుతం సమంతతోనే ఈ దర్శక–ద్వయం ‘సిటాడెల్’ అనే మరో వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ప్రియాంకా చో్రపా నటించిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హిట్ డ్రామా ‘సిటాడెల్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. గూఢచారి సాహసాల నేపథ్యంలో పూర్తి స్థాయి యాక్షన్ సిరీస్‌గా రూపొందుతోంది. ఇందులో సమంత యాక్షన్ సీన్స్‌లో అలరించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. -
ఆ సమయంలో నరకం చూశా, మైండ్ అసలు పని చేయలేదు: దీపికా పదుకొణె
కరోనా మహమ్మారి సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్వూలో సెకండ్ వేవ్ లాక్డౌన్ సమయంలో తాను గడిపిన రోజులకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. దీపికా మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్డౌన్ చాలా మంది జీవితాలను మార్చివేసిందని, తాను కూడా సెకండ్ వేవ్ సమయంలో చాలా ఇబ్బందులు పడినట్లు చెప్తూ భావోద్వేగానికి లోనైంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ లాక్డౌన్ సమయంలో తనకు మాత్రమే కాదని తన కుటుంబం మొత్తానికి ఒకే సమయంలో కోవిడ్ సోకిందని తెలపింది. దీంతో మహమ్మారి నుంచి కోలుకోవడానికి తమకి చాలా సమయమే పట్టిందని చెప్పుకొచ్చింది. కోవిడ్ తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని అంతేగాక తను ఫిజికల్‌గా మారినట్లు తెలపింది. లాక్డౌన్ సమయంలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పటి పరిణామాల కారణంగా తన మైండ్ సరిగా పని చేయలేదని అందుకు రెండు నెలలు తన పనికి సెలవు పెట్టి విశ్రాంత్రి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. మొదటి కోవిడ్ లాక్డౌన్ సమయంలో దీపికా పదుకొణె, ఆమె భర్త, నటుడు రణవీర్ సింగ్ ముంబైలోని వారి నివాసంలో ఉన్నారు. సెకండ్ వేవ్ లాక్డౌన్ సమయంలో, ఈ క్యూట్ కపుల్ దీపికా తల్లిదండ్రులతో కొన్ని రోజులు గడపడానికి బెంగళూరుకు వెళ్లారు. దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ కొత్త సినిమా 83 శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. 1983లో లార్డ్స్‌లో జరిగిన ప్రపంచకప్‌లో భారతదేశం సాధించిన చారిత్రాత్మక విజయం ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. రణవీర్ సింగ్ అప్పటి క్రికెట్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రను పోషిస్తుండగా, దీపికా పదుకొనే కపిల్ దేవ్ భార్య రోమిగా నటించింది. చదవండి: Merry Christmas: విజయ్ సేతుపతికి జోడీగా కత్రినా కైఫ్ -
పుట్టబోయే పాప కోసం పేర్లు వెతుకుతున్న రణ్‌వీర్‌సింగ్
బాలీవుడ్‌లోని బ్యూటీఫుల్ కపుల్స్‌లో దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ జంట ఒకటి. సినిమాలతో ఎంతో బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ బిజీ షెడ్యూల్లోనూ రణ్వీర్ ఓ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ షో పేరు ‘ది బిగ్ పిక్చర్’. అందులో రణ్వీర్ పుట్టబోయే పాప కోసం పేరు వెతుకుతున్నట్లు తెలిపాడు. కలర్స్ టీవీలో ప్రసారం కానున్న ఈ షో ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో కంటెస్టెంట్‌తో రణ్వీర్ మాట్లాడుతూ.. ‘నాకు పెళ్లి అయిందని మీ అందరికీ తెలుసు. రెండు, మూడు సంవత్సరాల్లో పిల్లలు కూడా పుడతారు. మీ వదిన చాలా క్యూట్‌గా ఉంటుంది. నేను చాలాసార్లు నీలాంటి పాపని నాకు ఇవ్వు. నా లైఫ్ సెట్ అయిపోతుందని అడుగుతుంటా. పాప వస్తే నా జీవితం అద్భుతంగా మారుతుంది’ అని అన్నాడు. అంతేకాకుండా భవిష్యత్తులో పుట్టబోయే పాప కోసం మంచి పేరు కోసం వెతుకుతున్నట్లు తెలిపాడు. అయితే రణ్వీర్ ప్రస్తుతం సూర్యవంశీ, ‘83’, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ వంటి చిత్రాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. చదవండి: దీపికాకు గ్లోబల్ అవార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ View this post on Instagram A post shared by Pinkvilla (@pinkvilla) -
డ్రగ్ కేసు; రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎన్సీబీ సమన్లు
ముంబై : బాలీవుడ్లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్నటివరకు కేవలం బాలీవుడ్, శాండల్‌వుడ్‌కే పరిమితమైన ఈ కేసు ఇపుడు టాలీవుడ్‌ను సైతం వెంటాడుతోంది. ముంబై డ్రగ్స్ కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో సారా అలీఖాన్, దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్ వంటి బీటౌన్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్‌లోనూ ప్రముఖ నటీమణుల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. డ్రగ్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, నమ్రత పేరు బయట పడటంతో సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. అంతేగాక టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతా చాట్ చేసినట్టుగా జాతీయ మీడియాలో వచ్చింది. (డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్: కంగనా) ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ స్టార్స్ దిపికా, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్‌లకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నోటీసులు జారీ చేసింది, మూడు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. (టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు..) -
కపుల్ దేవ్
‘‘తన కలల కంటే కూడా తన భర్త కలల్ని తనవిగా భావించే స్త్రీలందరికీ ఈ సినిమా అంకితం’’ అంటున్నారు దీపికా పదుకోన్. 1983లో భారత జట్టు తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచిన సంఘటన ఆధారంగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించారు. ఆయన భార్య రోమీ పాత్రను దీపికా పదుకోన్ చేశారు. ఆల్రెడీ రణ్వీర్ లుక్‌ని విడుదల చేశారు. రణ్వీర్–దీపికా కలిసి ఉన్న లుక్‌ను బుధవారం విడుదల చేశారు. వివాహం తర్వాత ఈ కపుల్ కలసి నటించిన చిత్రమిది. ‘‘దేశానికి గర్వకారణంగా నిలిచిన సంఘటనతో తీసిన సినిమాలో చిన్న పాత్ర చేయడం గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు దీపికా. ‘83’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
దీపికా.. ఎవరికి మద్దతిస్తున్నావో తెలుసా!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూను సందర్శించిన బాలీవుడ్ నటి దీపికా పడుకోన్‌ను నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తుంటే తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దీపికా చర్యను తప్పుపట్టారు. దేశ విధ్వంసాన్ని కోరుకునే వారికి తాను బాసటగా నిలిచానని దీపికా పడుకోన్ తెలుసుకోవాలని స్మృతి ఇరానీ అన్నారు. వార్తలను ఫాలో అయ్యేవారికి ఇలాంటి వారు ఎటువైపు నిలబడుతున్నారనేది అర్ధమవుతుందని తాను భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు హిందూ సంఘాలు దీపిక చర్యను తప్పుపడుతూ ఆందోళన చేపట్టాయి. ముసుగు దుండగుల దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్ధులకు ఆమె బాసట తెలపడంతో దీపికా తాజా చిత్రం చపాక్‌ను బహిష్కరించాలని కొందరు బీజేపీ నేతలు పిలుపు ఇచ్చారు. జేఎన్‌యూలో చెలరేగిన హింసను ఖండిస్తూ దీపికా పడుకోన్ ఆజ్ తక్ టీవీతోనూ మాట్లాడారు. జేఎన్‌యూ దాడిపై తాను తీవ్ర ఆగ్రహంతో ఉన్నానని, దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. -
కాన్స్‌లో మన క్వీన్స్
కాన్స్ ఫెస్టివల్ మళ్లీ తిరిగొచ్చింది. ఫ్రెంచ్ రివెరా నదీ తీరాన 72వ కాన్స్ చలన చిత్రోత్సవాలు మొదల య్యాయి. ప్రపంచవ్యాప్తంగా సినిమాలను సెలబ్రేట్ చేసుకునే పండగే కాన్స్. ఈ ఏడాది మే 14 నుంచి 25 వరకూ ఈ ఫెస్టివల్ జరుగుతుంది. సినిమాలతో పాటు కాన్స్ మెయిన్ అట్రాక్షన్ ఎర్ర తివాచీపై కనిపించే పొడుగు గౌన్లు. అందుకే దీన్ని పొడుగు గౌన్ల పండగ అని కూడా అనుకోవచ్చు. ‘ఐ కేన్’ అంటూ కాన్స్‌లో ప్రతీ హీరోయిన్ మీటర్ల కొద్దీ గౌన్లను ధరించడానికి రెడీ అవుతుంటారు. ఈ ఏడాది కాన్స్‌లో ఎర్ర తివాచీపై పొడవు గౌన్లతో దీపికా పదుకోన్, కంగనా రనౌత్, ఐశ్వర్యారాయ్, సోనమ్ కపూర్ కనిపించడానికి రెడీ అవుతున్నారు. తొలిసారి అందాల ప్రదర్శన చేయడానికి ప్రియాంకా చోప్రా, డయానా పెంటీ, హీనా ఖాన్ సిద్దమయ్యారు. వీరిలో దీపికా, కంగనా, ప్రియాంకలు కాన్స్ ఎర్రతివాచీపై హోయలొలికించారు. దీపికా, ప్రియాంక గౌనుల్లో దర్శనమిస్తే కంగనా మాత్రం కంచి పట్టు చీరలో కనువిందు చేశారు. -
జోడీ రిటర్న్ ్స
బాలీవుడ్ ఆన్‌స్క్రీన్ సూపర్‌హిట్ జోడీల్లో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకోన్ జంట ఒకటి. వీళ్లిద్దరూ కలిసి ‘హే జవానీ హై దివానీ, తమాషా’ సినిమాల్లో నటించారు. లేటెస్ట్గా మరోసారి స్క్రీన్‌పై కనిపించడానికి రెడీ అయ్యారని తెలిసింది. అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ సినిమా రూపొందనుందట. అందులో రణ్‌బీర్, దీపికాను లీడ్ పెయిర్‌గా ఎంపిక చేసుకున్నారట చిత్రబృందం. ఈ సినిమానే కాకుండా లవ్ రంజన్ దర్శకత్వంలో రూపొందే సినిమాలోనూ రణ్‌బీర్, దీపికా జోడీగా నటిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఒక్కటి కన్ఫర్మ్ అయినా మళ్లీ ఈ జంటను స్క్రీన్‌పై చూడొచ్చు. రణ్‌బీర్ ప్రస్తుతం చేస్తున్న ఫ్యాంటసీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ 2019 క్రిస్మస్ సీజన్లో రిలీజ్ కావాలి. ప్రస్తుతం 2020 సమ్మర్లో రిలీజ్ కానుందని ప్రకటించారు. -
లాయిడ్ బ్రాండ్ అంబాసిడర్లుగా దీప్‌వీర్ జంట
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హావెల్స్ ఇండియాకు కన్య్సూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ అయిన లాయిడ్ ప్రచార కర్తలుగా రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొనేలు వ్యవహరించనున్నారు. దీప్‌వీర్ జంట తమ ఉత్పత్తులైన ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మిషన్లు, టెలివిజన్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారని లాయిడ్ సీఈఓ శశి అరోరా ప్రకటించారు. అమితాబ్ బచ్చన్ స్థానంలో వీరు నియమితులైనట్లు తెలిపారు. -
స్క్రీన్ టెస్ట్
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలా ఏ స్థాయికి వెళతారో ఎవరూ ఊహించలేరు. అందుకే సినిమా అనేది చాలా మందికి డ్రీమ్. ఆ కలకి నాయకుడు దర్శకుడు. అందుకే దర్శకుణ్ణి ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అంటారు. సినిమా ఇండస్ట్రీలోని అనేక శాఖల్లో పని చేసిన అనుభవంతో మెగాఫోన్ పట్టిన దర్శకుల గురించి ఈ వారం క్విజ్ స్పెషల్... 1. ఈయన మొదట దర్శకుడు కాదు. ఎడిటింగ్ శాఖలో ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. తర్వాత చాలా పెద్ద దర్శకుడయ్యారు. ఎవరా డైరెక్టర్? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) వంశీ పైడిపల్లి డి) ఎస్.ఎస్ రాజమౌళి 2. నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారామె. ‘చిన్నారి పాపలు’ అనే చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. ఎవరా హీరోయిన్? ఎ) ‘షావుకారు’ జానకి బి) జమున సి) సావిత్రి డి) వాణిశ్రీ 3. ఈ ప్రముఖ హీరోల్లో ఓ హీరో మెగాఫోన్ పట్టుకోలేదు. ఆయనెవరో కనుక్కోండి? ఎ) అక్కినేని బి) కృష్ణ సి) యన్టీఆర్ డి) చిత్తూరు వి. నాగయ్య 4. దర్శకత్వం చేయకముందు నంబర్ ప్లేట్లకు స్టిక్కర్ డిజైనింగ్ చేయడంలో అందెవేసిన చెయ్యి ఈ దర్శకునిది. ఎవరా దర్శకుడు? ఎ) సుధీర్‌వర్మ బి) మారుతి సి) చిన్నికృష్ణ డి) విరించివర్మ 5. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ చిత్రంతో దర్శకునిగా మారారు. అంతకుముందు ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఎ) బోయపాటి శ్రీను బి) వక్కంతం వంశీ సి) కొరటాల శివ డి) దశరథ్ 6 నటి విజయశాంతి మేకప్‌మేన్‌గా ఈయన సుపరిచితుడు. ‘పెద్దరికం’ చిత్రానికి దర్శకత్వం వహించి విజయం సాధించారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతగానూ పేరుంది. ఎవరతను? ఎ) బండ్ల గణేష్ బి) ‘దిల్’ రాజు సి) ఏ.యం.రత్నం డి) కాస్ట్యూమ్స్ కృష్ణ 7. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా 400 చిత్రాలకు పైగా పని చేశారీయన. తన దర్శకత్వ ప్రతిభతో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎవరా నటుడు? ఎ) చలం బి) పద్మనాభం సి) రాజబాబు డి) రేలంగి 8. పవన్ కల్యాణ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘జానీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించారు. ఆ చిత్రంలో పవన్ సరసన నటించిన కథానాయిక ఎవరో కనుక్కోండి? ఎ) కీర్తి రెడ్డి బి) రేణూ దేశాయ్ సి) సుప్రియ డి) అమీషా పటేల్ 9. 1957లో ‘పాండురంగ మహత్యం’ సినిమాలో బాలకృష్ణుని పాత్రలో నటించారీమె. 1971లో ‘మీనా’ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఎవరా ప్రముఖ నటి? ఎ) బి.సరోజాదేవి బి) కృష్ణకుమారి సి) కాంచన డి) విజయనిర్మల 10. తమిళ నటుడు జీవా, కార్తీక కాంబినేషన్లో తమిళ్, తెలుగులో విడుదలైన చిత్రం ‘రంగం’. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ కెమెరామేన్. ఆ కెమెరామేన్ పేరేంటో కనుక్కోండి? ఎ) పీసీ శ్రీరామ్ బి) రాజీవన్ సి) కేవీ ఆనంద్ డి) రసూల్ ఎల్లోర్ 11. నటునిగా 150 చిత్రాలను పూర్తి చేసుకున్నారు యాక్షన్ కింగ్ అర్జున్. ఆయన దర్శకునిగా మారి ఎన్ని చిత్రాలు తెరకెక్కించారో తెలుసా? ఎ) 5 బి) 8 సి) 7 డి) 11 12. 1949లో యన్టీఆర్ నటించిన మొదటి చిత్రం ‘మన దేశం’ రిలీజైంది. 1961లో ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఆ చిత్రం పేరేంటి? ఎ) తల్లా? పెళ్లామా? బి) వరకట్నం సి) సీతారామ కల్యాణం డి) శ్రీకృష్ణ పాండవీయం 13. దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ మొదట దర్శకత్వ శాఖలో పనిచేయలేదు. సినీ పరి శ్రమలో మొదట ఆయన ఏ శాఖలో పనిచేశారో తెలుసా? ఎ) ఎడిటింగ్ బి) కెమెరా సి) ఆడియోగ్రాఫర్ డి) కొరియోగ్రాఫర్ 14 కమల్‌హాసన్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘చాచీ 420’. ఆ చిత్రంలో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) టబు బి) గౌతమి సి) అమలా డి) రమ్యకృష్ణ 15. ‘మణికర్ణిక’ చిత్రానికి మొదట దర్శకునిగా చాలా బాగాన్ని చిత్రీకరించారు క్రిష్. ఆ తర్వాత ఆయన ‘యన్టీఆర్’ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం వల్ల మిగతా చిత్రాన్ని కంప్లీట్ చేసిన నాయిక ఎవరో చెప్పుకోండి? ఎ) ఆలియా భట్ బి) దీపికా పదుకోన్ సి) కంగనా రనౌత్ డి) ప్రియాంకా చోప్రా 16 హీరో కృష్ణ దాదాపు 230 సినిమాల్లో నటించిన తర్వాత ‘సింహాసనం’ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. ఆ సినిమాలో విషకన్య పాత్ర ద్వారా తెలుగులో నటించిన బాలీవుడ్ నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) దివ్యభారతి బి) రేఖ సి) హేమమాలిని డి) మందాకిని 17. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన చిత్రం ‘చండీరాణి’. ఆ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఫేమస్ హీరోయిన్ ఎవరు? ఎ) భానుమతి బి) లక్ష్మీ సి) యస్.వరలక్ష్మీ డి) అంజలీదేవి 18. ఆయనో ప్రముఖ నిర్మాత. అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో దర్శకుడయ్యారు. తను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘దసరాబుల్లోడు’తో సంచలన విజయం నమోదు చేశారు. ఆ దర్శక–నిర్మాత ఎవరో తెలుసా? ఎ) వీబీ రాజేంద్రప్రసాద్ బి) కేయస్ ప్రకాశరావు సి) క్రాంతికుమార్ డి) మురారి 19. సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తేజ. ఆయన దర్శకుడు కాకముందు ఫేమస్ సినిమాటోగ్రాఫర్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏంటో గుర్తుందా? ఎ) జయం బి) చిత్రం సి) నిజం డి) ధైర్యం 20. తరుణ్, రాజా, సలోనిలు ముఖ్య పాత్రలుగా నటించిన చిత్రం ‘ఒక ఊరిలో’. ఆ చిత్రంతో దర్శకునిగా మారారు రమేశ్‌వర్మ. దర్శకుడు కాకముందు ఆయన ఏం చేసేవారో తెలుసా? ఎ) స్టిల్ ఫొటోగ్రఫీ బి) ఆర్ట్ డైరెక్టర్ సి) పోస్టర్ డిజైనర్ డి) మ్యూజిక్ డైరెక్టర్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) సి 3) ఎ 4) బి 5) సి 6) సి 7) బి 8) బి 9) డి 10) సి 11) డి 12) సి 13) సి 14) ఎ 15) సి 16) డి 17) ఎ 18) ఎ 19) బి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
ఆ సినిమా ఆగలేదు
‘పద్మావత్’ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ నెక్ట్స్ మూవీ ఏంటి? అంటే ‘చపక్’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ అని చటుక్కున చెప్పొచ్చు. కానీ ఈ సినిమా అధికారికంగా వెల్లడవ్వక ముందు దీపిక ఓ ఫిమేల్ సూపర్ హీరో ఫిల్మ్ చేయబోతున్నారని బాలీవుడ్లో వార్తలు వచ్చాయి. తీరా ‘చపక్’ అనౌన్స్ కాగానే ఈ సినిమా ఆగిపోయిందని మాట్లాడుకున్నారు బాలీవుడ్ జనాలు. కానీ ఆ సినిమా ఆగిపోలేదు. ‘‘నేను సూపర్‌హీరో పాత్ర చేయబోయే సినిమా పూర్తిగా ఆగిపోలేదు. ఆ సినిమాపై నేను, నా ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాం. ఈ సినిమా కాస్త కొత్తగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత త్వరగా సెట్స్‌పైకి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకా పూర్తి కథ రెడీ కాలేదు. ఇప్పుడే విత్తు నాటాం. పెంచి పోషించడానికి కష్టపడుతున్నాం’’ అని ఓ ఇంటర్వ్యూలో దీపికా పేర్కొన్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ‘రాజీ’ ఫేమ్ మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపికా పదుకోన్ నటించినున్న ‘చపక్’ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో స్టార్ట్ కానుంది. ఇక దీపిక పర్సనల్ లైఫ్‌లోకి తొంగిచూస్తే... ఈ ఏడాది రణ్వీర్ సింగ్‌తో ఏడడుగులు వేసిన ఆమె న్యూ ఇయర్ వేడుకలతో పాటు తన బర్త్ డే వేడుకలను కూడా ఫారిన్లో ప్లాన్ చేశారు. జనవరి 5న దీపికా పుట్టినరోజని ప్రత్యేకించి చెపక్కర్లేదు. -
దీపికా, రణవీర్ పెళ్లి ఫోటోలు ఇవిగో....
సాక్షి, ముంబై : బాలీవుడ్ లవ్‌బర్డ్స్ దీపికా-రణవీర్‌సింగ్ పెళ్లి ఫోటోల కోసం ప్రపంచమంతా కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసింది. ఎపుడెపుడు వారి వేడుక ఫోటోలను చూడాలా అని ఈ జంట అభిమానులతో పాటు సినీలోకమంతా ఆసక్తిగా నెట్లో వెతుకులాడుతోంది అంటే అతిశయోక్తి కాదేమో. చివరికి ఈ ఫోటోలు దర్శనమిచ్చాయి. స్వయంగా కొత్త పెళ్లి కూతురు దీపికా తన ట్విటర్ పోస్ట్ చేసి వేడుక చేసింది. అభిమానుల ముచ్చట తీర్చింది. అటు రణవీర్‌సింగ్ కూడా ట్విటర్లో అవే ఫోటోలను పోస్ట్ చేయడం విశేషం. దీంతో ఈ ఫోటోలు వైరల్‌గా మారిపోయాయి. కాగా బుధవారం ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స్‌లో అత్యంత ఘనంగా దీపికా, రణవీర్‌లు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. దీప్‌వీర్ పెళ్లి తంతు రెండో రోజైన గురువారం సింధీ స్టయిల్లో జరిగిందట. రణవీర్ సింగ్, దీపికా పదుకోనే పెళ్లి ఫోటోలు కనీసం ఒక్కటి కూడా మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ రాలేదు. ఈ క్యూరియాసిటీపై పలు జోకులు సెటైర్లు కూడా పేలాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫన్నీ ఫోటోనే ఇందుకు నిదర్శనం. ❤️ pic.twitter.com/arIntwadPg — Deepika Padukone (@deepikapadukone) November 15, 2018 -
నో ఆన్సర్
‘పద్మావతి’ తర్వాత దీపికా పదుకోన్ ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. విశాల్ భరద్వాజ్‌తో ఓ సినిమా ఒప్పుకున్నప్పటికీ ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యం పాలవ్వడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ మధ్యన ఓ సూపర్ హీరోయిన్ ఫిల్మ్‌లో యాక్ట్ చేస్తారని వార్త వచ్చినా అది కూడా ఇంకా ఐడియా దశలోనే ఉందట. మరో చిత్రం స్టేటస్ కూడా ఇంతే. శ్రీదేవి నటించిన ఓ సూపర్ హిట్ చిత్రం రీమేక్‌లో నటించనున్నారని తాజా ఖబర్. నలభై ఏళ్ల క్రితం ఓ సౌత్ ప్రొడ్యూసర్ నిర్మాణంలో బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఒక శ్రీదేవి సూపర్ హిట్ చిత్రం ఆధారంగా ఈ సినిమా ఉంటుందట. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ విషయంలో బిజీగా ఉన్న టీమ్ అది కంప్లీట్ అవ్వగానే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. సో అప్పటి వరకు నెక్ట్స్ ఏంటీ? అంటే.. దీపికా దగ్గర నో ఆన్సర్. -
ఎవరి టాలెంట్ వాళ్లది
కొత్త సంవత్సరంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇంకా ఏం నిర్ణయించుకోలేదా? అయితే జాక్వెలీన్ ఫెర్నాండెజ్ దగ్గర్నుంచి చిన్న టిప్ తీసుకోవచ్చు. జాక్వెలీన్ ప్రస్తుతం ‘రేస్–3’లో యాక్ట్ చేస్తోంది. షూటింగ్ బ్రేక్‌లో మీడియా వాళ్లొచ్చి ‘హాయ్ జాక్’ అన్నారు. జాక్వెలీన్ నవ్వింది. ‘ఏంటి టెన్షన్‌గా ఉన్నారు? ఈ మూవీలో మీకు పోటీగా దీపికా పడుకోన్ లేదుగా?’ అన్నారు ఆ వచ్చినవాళ్లు! జాక్వెలీన్ మళ్లీ నవ్వింది. ‘రేస్–2’లో దీపిక, జాక్వెలీన్ నటించినప్పుడు అప్పట్లో అందరూ జాక్వెలీన్ని దీపికతో కంపేర్ చేశారు. ఇప్పుడు ‘రేస్–2’లో దీపిక లేకపోయినా మళ్లీ దీపికతోనే జాక్వెలీన్ని కంపేర్ చేస్తున్నారు. అందుకే జాక్వెలీన్ నవ్వింది. నవ్వి ఊరుకోలేదు. ఊరుకుంటే మీడియా వాళ్లు ఊరుకోరని ఆమెకు తెలుసు. దీపిక లేదు కాబట్టి జాక్వెలీన్ హాయిగా, టెన్షన్ లేకుండా ‘రేస్–3’లో నటించేస్తోంది అని రాసేస్తారు. వాళ్లు అలా రాస్తారని కాదు కానీ, జాక్వెలీన్ చెప్పాలనుకున్నది చెప్పేసింది.. ‘నేనే కాదు, మీరు కూడా లైఫ్ కంపేరిజన్స్నిసీరియస్గా తీసుకోకండి’ అని! జాక్వెలీన్ సలహాని మీ కొత్త సంవత్సరం రిజల్యూషన్లలో ఒకటిగా చేర్చుకోవచ్చేమో థింక్ చెయ్యండి. -
ఇట్స్ మై లైఫ్
-
ఇక నో చాన్స్..
కండలతో కొండలా కనిపించే బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్.. తన మనసు కూడా కఠినమే అని చెప్పకనే చెప్పాడు. ఒకప్పుడు తాను వలచిన కత్రినాకు చాన్స్‌ల మీద చాన్స్‌లు ఇప్పించిన సల్లూభాయ్.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించాడు. తన అప్‌కమింగ్ మూవీ సుల్తాన్‌లో హీరోయిన్గా కత్రినాకు అస్సలు ఆఫర్ చేయొద్దని దర్శక, నిర్మాతలకు షరతు పెట్టాడట. కత్రినాను హీరోయిన్గా బుక్ చేస్తే.. సినిమా నుంచి తాను తప్పుకుంటానని అన్నాడట. దీంతో మరో మార్గం లేక దీపికా పడుకునేను హీరోయిన్గా ఫిక్స్ చేశారట ఆ డైరెక్టర్. -
జోడీ కట్టేదెవరో?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఒకరు, యానిమేషన్లో మరొకరు ప్రత్యక్షంగా జోడీకట్టి రొమాన్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీస్ ఎవరన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎస్. వారిద్దరూ ఉత్తరాదిలో ఏలుతున్న దీపికా పదుకునే, సోనాక్షి సిన్హాలే. కాగా ఈ ముద్దుగుమ్మల్లో ఒకరు ఇళయదళపతితో జోడీ కట్టే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. విజయ్ తాజాగా శింబుదేవన్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథా చిత్రం పులిలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఆయనకు 58వ చిత్రం. ఇందులోవిజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఆయన సరసన శ్రుతిహాసన్, హన్సికలు నటిస్తున్నారు. కాగా విజయ్ 59వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి రాజారాణి చిత్రం ఫేమ్ అట్లి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి కథను రెడీ చేస్తున్నారు. పులి సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. తదుపరి అట్లి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే అది నిరాదార ప్రచారం అనేది తాజా సమాచారం. కాగా ఇప్పుడు విజయ్ సరసన నటించడానికి బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకునే, సోనాక్షి సిన్హాలలో ఒకరిని ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. -
నేనే కత్రినా అయితే రణబీర్ ను!
సొట్ట బుగ్గల అమ్మడు దీపికా పడుకొనే వరుస చూస్తుంటే భలే విచిత్రంగా ఉంది. హీరో రణబీర్ కపూర్‌తో కొన్నాళ్లు తిరిగి... వదిలేసిన ఈ చిన్నది... సహ నటి కత్రినాకైఫ్‌కు సలహాలిస్తోంది. ‘నేనే కత్రినా అయితే... రణబీర్‌ను పెళ్లిచేసుకునేదాన్ని’ అంటూ మనసులో మాట బయటపెట్టింది. ఇంతకీ ఉన్నట్టుండి ఈ విషయం ఎందుకు చెప్పిందనేగా! కత్రినా రణబీర్‌ను పెళ్లి చేసుకోవడం లేదంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన దీపిక... తప్పంతా మీడియాదేనన్నట్టుగా మాట్లాడేసింది. తాను అన్నది ఒకటి... బయటకు వచ్చింది మరొకటని వాపోయింది.