సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూను సందర్శించిన బాలీవుడ్ నటి దీపికా పడుకోన్‌ను నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తుంటే తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దీపికా చర్యను తప్పుపట్టారు. దేశ విధ్వంసాన్ని కోరుకునే వారికి తాను బాసటగా నిలిచానని దీపికా పడుకోన్ తెలుసుకోవాలని స్మృతి ఇరానీ అన్నారు. వార్తలను ఫాలో అయ్యేవారికి ఇలాంటి వారు ఎటువైపు నిలబడుతున్నారనేది అర్ధమవుతుందని తాను భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు హిందూ సంఘాలు దీపిక చర్యను తప్పుపడుతూ ఆందోళన చేపట్టాయి.
ముసుగు దుండగుల దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్ధులకు ఆమె బాసట తెలపడంతో దీపికా తాజా చిత్రం చపాక్‌ను బహిష్కరించాలని కొందరు బీజేపీ నేతలు పిలుపు ఇచ్చారు. జేఎన్‌యూలో చెలరేగిన హింసను ఖండిస్తూ దీపికా పడుకోన్ ఆజ్ తక్ టీవీతోనూ మాట్లాడారు. జేఎన్‌యూ దాడిపై తాను తీవ్ర ఆగ్రహంతో ఉన్నానని, దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత దారుణమని ఆమె వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment