
ఇక నో చాన్స్..
కండలతో కొండలా కనిపించే బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్.. తన మనసు కూడా కఠినమే అని చెప్పకనే చెప్పాడు. ఒకప్పుడు తాను వలచిన కత్రినాకు చాన్స్‌ల మీద చాన్స్‌లు ఇప్పించిన సల్లూభాయ్.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించాడు. తన అప్‌కమింగ్ మూవీ సుల్తాన్‌లో హీరోయిన్‌గా కత్రినాకు అస్సలు ఆఫర్ చేయొద్దని దర్శక, నిర్మాతలకు షరతు పెట్టాడట. కత్రినాను హీరోయిన్‌గా బుక్ చేస్తే.. సినిమా నుంచి తాను తప్పుకుంటానని అన్నాడట. దీంతో మరో మార్గం లేక దీపికా పడుకునేను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట ఆ డైరెక్టర్.