నేనే కత్రినా అయితే రణబీర్ ను! | if i am katrina: says deepika | Sakshi
Sakshi News home page

నేనే కత్రినా అయితే రణబీర్ ను!

Published Sat, Jan 17 2015 9:28 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

నేనే కత్రినా అయితే రణబీర్ ను!

నేనే కత్రినా అయితే రణబీర్ ను!

సొట్ట బుగ్గల అమ్మడు దీపికా పడుకొనే వరుస చూస్తుంటే భలే విచిత్రంగా ఉంది. హీరో రణబీర్ కపూర్‌తో కొన్నాళ్లు తిరిగి... వదిలేసిన ఈ చిన్నది... సహ నటి కత్రినాకైఫ్‌కు సలహాలిస్తోంది. ‘నేనే కత్రినా అయితే... రణబీర్‌ను పెళ్లిచేసుకునేదాన్ని’ అంటూ మనసులో మాట బయటపెట్టింది.

ఇంతకీ ఉన్నట్టుండి ఈ విషయం ఎందుకు చెప్పిందనేగా! కత్రినా రణబీర్‌ను పెళ్లి చేసుకోవడం లేదంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన దీపిక... తప్పంతా మీడియాదేనన్నట్టుగా మాట్లాడేసింది. తాను అన్నది ఒకటి... బయటకు వచ్చింది మరొకటని వాపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement