
బాలీవుడ్‌లోని బ్యూటీఫుల్ కపుల్స్‌లో దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ జంట ఒకటి. సినిమాలతో ఎంతో బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ బిజీ షెడ్యూల్‌లోనూ రణ్‌వీర్ ఓ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ షో పేరు ‘ది బిగ్ పిక్చర్’. అందులో రణ్‌వీర్ పుట్టబోయే పాప కోసం పేరు వెతుకుతున్నట్లు తెలిపాడు.
కలర్స్ టీవీలో ప్రసారం కానున్న ఈ షో ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో కంటెస్టెంట్‌తో రణ్‌వీర్ మాట్లాడుతూ.. ‘నాకు పెళ్లి అయిందని మీ అందరికీ తెలుసు. రెండు, మూడు సంవత్సరాల్లో పిల్లలు కూడా పుడతారు. మీ వదిన చాలా క్యూట్‌గా ఉంటుంది. నేను చాలాసార్లు నీలాంటి పాపని నాకు ఇవ్వు. నా లైఫ్ సెట్ అయిపోతుందని అడుగుతుంటా. పాప వస్తే నా జీవితం అద్భుతంగా మారుతుంది’ అని అన్నాడు. అంతేకాకుండా భవిష్యత్తులో పుట్టబోయే పాప కోసం మంచి పేరు కోసం వెతుకుతున్నట్లు తెలిపాడు. అయితే రణ్‌వీర్ ప్రస్తుతం సూర్యవంశీ, ‘83’, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ వంటి చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు.
చదవండి: దీపికాకు గ్లోబల్ అవార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్
Comments
Please login to add a commentAdd a comment