ranabir kapoor
-
సాఫ్ట్ గా కనిపిస్తాడు కానీ.. రణబీర్ మామూలోడు కాదు
-
రణబీర్ కపూర్‌కు కోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌పై పుణె సివిల్ కోర్టులో దావా దాఖలైంది. కల్యాణి నగర్‌లోని ట్రంప్ టవర్‌లో గల రణబీర్ కపూర్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న సూర్యవంశీ అనే మహిళ రణబీర్‌పై 50 లక్షల రూపాయలకు దావా వేశారు. రెంటల్ అగ్రిమెంట్ నియమాలను రణబీర్ ఉల్లంఘించాడంటూ సదరు మహిళ ఈ దావా వేశారు. అగ్రిమెంట్ వ్యవధి కంటే ముందే తనను ఇల్లు ఖాళీ చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నట్టుండి తన కుంటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయించడంతో తీవ్ర ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని వాపోయారు. వివరాలు: 2016 అక్టోబర్‌లో ‘లీవ్ అండ్ లైసెన్స్’ ప్రాతిపదికన రణబీర్ తన అపార్ట్‌మెంట్‌ను సూర్యవంశీకి నెలకు 4 లక్షల రూపాయల చొప్పున 24 నెలల కాలానికి అద్దెకు ఇచ్చారు. కానీ, అనుకోకుండా 11 నెలలు కాగానే ఇల్లు ఖాళీ చేయాలని రణబీర్ పట్టుబట్టాడని ఆమె వెల్లడించారు. చివరికి 2017 అక్టోబర్‌లో బలవంతంగా అపార్ట్మెంట్ ఖాళీ చేయించారని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అపార్ట్మెంట్ ఖాళీ చేయండని రణబీర్ వాళ్లు మాతో అమర్యాదగా ప్రవర్తించారని సూర్యవంశీ కోర్టుకు విన్నవించారు. కాగా, మెయిల్ ద్వారా కోర్టు నోటీసులు అందుకున్న రణబీర్ స్పందిస్తూ.. తాను రెంటల్ అగ్రిమెంట్ నియమాలను ఉల్లంఘించలేదని అన్నారు. ఇష్టపూర్వకంగానే సూర్యవంశీ ఇల్లు ఖాళీ చేశారని ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. కోర్టులో తన వాదనలు వినిపిస్తానని స్పష్టంచేశారు. -
చివరి సీన్లలో ఆయన నటిస్తే బాగుండేది
ముంబాయి: సంజయ్ దత్ బయోపిక్ ఆధారంగా నిర్మించిన తాజా చిత్రం ‘సంజు’ ట్రైలర్‌ను బాలీవుడ్కండల నటుడు సల్మాన్‌ఖాన్ బుధవారం వీక్షించారు. ఈ చిత్రం గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ..క్లైమాక్స్ సన్నివేశాల్లో సంజయ్ దత్ స్వయంగా నటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాజు హిర్వాణీ చాలా సెన్సిబుల్ డైరెక్టర్ అని, ఆయన తనదైన శైలిలో చిత్రాలు తీస్తుంటాడని అన్నారు. సల్మాన్ ఖాన్ బయోపిక్ భవిష్యత్‌లో వచ్చే అవకాశం ఉందా అని ఇంటర్వూలో ప్రశ్నించగా..తన బయోపిక్ తీసే ఉద్దేశం తనకు లేదని, అలాంటి పని తాను చేయనని చెప్పారు. ఒకవేళ తీసే ఉద్దేశం ఉంటే తానే బహిరంగా చెబుతానని వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్(52) తాజాగా నటించిన రేస్3 చిత్రం ఈ నెల 15న విడుదల అవుతోంది. సంజు సినిమాలో సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ నటించిన సంగతి తెల్సిందే. -
సంజయ్ దత్ బయోపిక్.. ఏ పాత్రల్లో ఎవరు?
న్యూఢిల్లీ: ఎంతో కాలంగా వేచి చూస్తున్న సంజయ్ దత్ బయోపిక్ సంజు టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిర్వాణీ దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్ తన 22 ఏట నుంచి ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఇరుకున్న దాకా జరిగిన పరిణామాలను ఈ సినిమాలో దర్శకుడు చూయించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో నటిస్తున్న పరేష్ రావల్, మనిషా కోయిరాలా, దియా మీర్జా పాత్రల గురించి మీడియాకు వెల్లడించారు. సునీల్ దత్‌గా పరేశ్ రావల్ ఈ సనిమాలో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రను పరేష్ రావల్ పోషిస్తున్నట్లు దర్శకుడు ధృవీకరించారు. తర్వాత విడుదల చేసే పరేష్‌ను ఇంట్రడ్యూస్ చేస్తామని తెలిపారు. నర్గీస్ దత్‌గా మనీషా కోయిరాలా సంజయ్‌దత్ తల్లిపాత్రకు మనీషా కోయిరాలాను తీసుకుంటున్నట్లు దర్శకుడు తెలిపారు. సంజయ్ దత్ నటించిన తొలి సినిమా విడుదలకు మూడు రోజుల ముందు నర్గీస్ క్యాన్సర్‌తో చనిపోయింది. మనీషా కోయిరాలా కూడా క్యాన్సర్ బాధితురాలే. విదేశాలలో చికిత్స తీసుకున్న అనంతరం క్యాన్సర్ మహమ్మారి నుంచి మనీషా విజయవంతంగా బయటపడిన విషయం తెల్సిందే. సంజయ్ దత్, మనీషా కోయిలారా కలిసి యాల్గార్, కార్టూస్, సనమ్ చిత్రాల్లో నటించారు. మాన్యతా దత్‌గా దియా మీర్జా సంజయ్ దత్ జీవితాన్ని సమూలంగా మార్చిన మూడో భార్య మాన్యతా దత్ పాత్ర నటి దియా మీర్జాను ఎంపిక చేశారు. వీరిద్దరికీ 2008లో పెళ్లి అయిన సంగతి తెల్సిందే. సంజయ్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన వ్యాపారాలన్నీ ఆమెనే చక్కబెట్టేవారు. సంజయ్ మొదటి భార్య రిచా శర్మ, రెండో భార్య రియా పిళ్లైల పాత్రలకు ఎవరిని తీసుకునేది దర్శకుడు ధృవీకరించలేదు. సంజయ్ బాల్య మిత్రుడి పాత్రకు విక్కీ కౌశల్ సంజయ్ దత్ బాల్య మిత్రుడు కుమార్ గౌరవ్ పాత్రకు విశాల్ కౌశల్‌ను తీసుకుంటున్నట్లు ఊహాగానాలు గతంలో వినిపించాయి. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ విశాల్ కౌశల్‌ను ఈ పాత్రకు తీసుకుంటున్నట్లు దర్శకుడు చెప్పారు. సంజయ్ దత్ రెండో సోదరి నమ్రతా దత్ భర్తే ఈ కుమార్ గౌరవ్. తొలి చిత్ర సహనటి పాత్రకు సోనమ్ సంజయ్ దత్ తొలి చిత్రం రాఖీలో సంజయ్‌తో జోడీ కట్టిన టీనా మునిమ్ పాత్రకు సోనమ్ కపూర్‌ను తీసుకుంటున్నట్లుగా తెలిసింది. అయితే ట్రైలర్ వస్తేగానీ ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సల్లూ భాయ్ పాత్రకు జిమ్ సర్భ్ సంజయ్ దత్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడు, బాలీవుడ్ కండల నటుడు సల్మాన్ ఖాన్ పాత్రకు జిమ్ సర్భ్ను తీసుకుంటున్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఒకానొక సమయంలో వారిద్దరూ చాలా సన్నిహితంగా మెలిగారు. ఇద్దరూ కలిసి సాజన్, చల్ మేరే భాయ్, ఓమ్ శాంతి ఓం సినిమాల్లో నటించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. జర్మలిస్టు పాత్రలో అనుష్క శర్మ ఈ సినిమాలో అనుష్క శర్మ జర్మలిస్టు పాత్ర పోషిస్తున్నట్లు తెలియవచ్చింది. బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగే జర్నలిస్టు పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. కరిష్మా టన్నా, బొమన్ ఇరానీ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించనున్నారు. కరిష్మా టన్నా, మాధురీ దీక్షిత్ పాత్రంలో, బొమన్ ఇరానీ, కాంటే సినిమా దర్శకుడు సంజయ్ గుప్తా పాత్రలకు తీసుకుంటున్నట్లు సినిమా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సంజయ్ దత్ బయోగ్రఫీ ఆధారంగా తీస్తోన్న ఈ చిత్రం జూన్ 29న విడుదల కానుంది. -
హయ్యస్ట్ అడ్వాన్స్ టాక్స్ పేయర్ సల్మాన్
వరుస సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాద్షాగా అవతరించిన సల్మాన్ ఖాన్, తాజాగా మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తన ప్రతీ సినిమాతో మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తున్న కండల వీరుడు పారితోషికంగా కూడా అదే స్థాయిలో అందుకుంటున్నాడు. అందుకే ఈ ఏడాది హయ్యస్ట్ అడ్వాన్స్ టాక్స్ పేయర్‌గా అవతరించాడు సల్మాన్. ఈ ఏడాది 16 కోట్ల అడ్వాన్స్ టాక్స్ కట్టిన సల్మాన్ నెంబర్ వన్‌గా నిలవగా, గత ఏడాది 18 కోట్లు పే చేసి నెంబర్ వన్‌గా ఉన్న అక్షయ్ ఈ ఏడాది కేవలం 11 కోట్లు మాత్రమే కట్టి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఒక్క హిట్ సినిమా కూడా లేకపోయినా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ 7.8 కోట్లు పే చేసి మూడో స్థానంలో నిలిచాడు. వీరి తరువాతి స్థానాల్లో కపిల్ శర్మ, అమీర్ ఖాన్ లు నిలవగా బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్ పేరు తొలి పది స్థానాల్లో కనిపించకపోవటం విశేషం. బాలీవుడ్ టాప్ స్టార్స్ ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్లు ఎంత కట్టారు, అన్న వివరాలను ఇన్ కంటాక్స్ డిపార్ట్మెంట్ వారు వెల్లడించలేదు. -
ఫ్లాప్ హీరోకి 38 కోట్లా..?
బాలీవుడ్ మోస్ట్ అన్ లక్కీ హీరో ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రణబీర్ కపూర్. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్న ఈ యంగ్ హీరో, హిట్ ఇవ్వడంలో మాత్రం వెనకపడుతున్నాడు. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో పాటు, నటుడిగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్న రణబీర్, ఇంత వరకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా ఇవ్వలేకపోయాడు. అయితే తాజాగా ఈ హీరో ఇంటి మీద ఐటీ రైడ్స్ జరిగిన నేపధ్యంలో ఒక ఆసక్తి కరమైన విషయం బయటికి వచ్చింది. వరుస ఫ్లాప్‌ల తరువాత రణబీర్ హీరోగా నటించిన తమాషా సినిమాకు, ఈ హీరో ఏకంగా 38 కోట్ల రూపాయల భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. తన మార్కెట్ కన్నా కూడా రణబీర్ తీసుకున్న రెమ్యూనరేషనే ఎక్కువ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ యంగ్ హీరో నటించిన గత చిత్రం బాంబే వెల్వేట్ కేవలం 24 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ నేపథ్యంలో రణబీర్‌కు 38 కోట్లు ఇవ్వటంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అయ్యాయి. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన తమాషా సినిమాను 75 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. అయితే తొలి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పటివరకు కేవలం 61 కోట్లు మాత్రమే వసూళు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రణబీర్ రెమ్యూనరేషన్ బయటకు రావటంతో యూనిట్ సభ్యులు షాక్ అవుతున్నారు. -
నేనే కత్రినా అయితే రణబీర్ ను!
సొట్ట బుగ్గల అమ్మడు దీపికా పడుకొనే వరుస చూస్తుంటే భలే విచిత్రంగా ఉంది. హీరో రణబీర్ కపూర్‌తో కొన్నాళ్లు తిరిగి... వదిలేసిన ఈ చిన్నది... సహ నటి కత్రినాకైఫ్‌కు సలహాలిస్తోంది. ‘నేనే కత్రినా అయితే... రణబీర్‌ను పెళ్లిచేసుకునేదాన్ని’ అంటూ మనసులో మాట బయటపెట్టింది. ఇంతకీ ఉన్నట్టుండి ఈ విషయం ఎందుకు చెప్పిందనేగా! కత్రినా రణబీర్‌ను పెళ్లి చేసుకోవడం లేదంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన దీపిక... తప్పంతా మీడియాదేనన్నట్టుగా మాట్లాడేసింది. తాను అన్నది ఒకటి... బయటకు వచ్చింది మరొకటని వాపోయింది. -
నాక్కూడా తల్లి కావాలనే కోరిక కలిగింది!
‘‘ఏ మనిషికైనా జీవిత భాగస్వామి అవసరం. అప్పుడే జీవితానికి ఓ పరిపూర్ణత లభిస్తుంది’’ అంటున్నారు కత్రినా కైఫ్. మరి... మీ పెళ్లెప్పుడు? అనే ప్రశ్న కత్రినా ముందుంచితే -‘‘ఇప్పుడు మాత్రం కాదు. పదేళ్ల లోపు పెళ్లి చేసుకుంటా’’ అన్నారు. రణబీర్‌కపూర్‌తో మీ పెళ్లి ఫిక్స్ అయ్యిందటగా? అనడిగితే -‘‘ఎవరన్నారు? రణబీర్ చెప్పాడా? నేను చెప్పానా? మీ అంతట మీరే ఊహించేసుకుంటే ఎలా? అసలిప్పటి వరకూ ‘నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని ఎవరూ నాతో అనలేదు. కానీ, బాగా ఖాళీగా ఉన్నవాళ్లు మాత్రం నన్నెవరో ఒకరితో ముడి పెట్టేస్తున్నారు. ఒకవేళ నాకు కనుక పెళ్లి ఫిక్స్ అయితే, అందరికీ చెప్పే చేసుకుంటా. ఇలా నిశ్చితార్థం అవ్వగానే అలా చెప్పేస్తా. ఎందుకంటే, పెళ్లనేది సిగ్గుపడాల్సిన విషయం కాదు కదా.. దాయడానికి. వాస్తవానికి నాకు వివాహ బంధం అంటే చాలా గౌరవం. నా సిస్టర్‌కి పెళ్లయ్యింది. అప్పుడు నాకూ పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ తర్వాత తనకు పిల్లలు పెట్టారు. అప్పుడు నాక్కూడా తల్లి కావాలనే కోరిక కలిగింది. అందుకని, కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. అమ్మ అవుతా. అయితే ఇప్పుడు కాదు’’ అని స్పష్టం చేశారు కత్రినా కైఫ్. -
అతణ్ణి ముద్దాడే అవకాశమొస్తే వదలను!
సినిమాల్లో తక్కువగా కనిపించడం, వివాదాల్లో ఎక్కువగా వినిపించడం ఆండ్రియా ప్రత్యేకత. అందం, అభినయంతో పాటు చక్కని గాన పటిమ కూడా ఉన్న ఆండ్రియా... సరిగ్గా ప్రయత్నిస్తే.. స్టార్ హీరోయిన్ అనిపించుకోవడం పెద్ద విషయమేం కాదు. కానీ... ఆ విషయాన్ని పక్కన పెట్టి, వివాదాలతోనే ఎక్కువగా సావాసం చేస్తుంటుంది ఈ చెన్నయ్ సుందరి. అందరూ సిగ్గుపడే అంశాలను సైతం లైట్‌గా తీసుకోవడం ఆండ్రియా స్పెషాలిటీ. ఆ మధ్య తన కంటే చిన్నవాడైన సంగీత దర్శకుడు అనిరుథ్‌తో ప్రేమాయణం నడిపింది. వారిద్దరి చుంబన దృశ్యాలు నెట్లో కూడా హల్చల్ చేశాయి. నీకంటే చిన్నాడితో ఆ పనేంటి? అని మీడియా అనడిగితే -‘‘ఇద్దరం ఇష్టపడ్డాం. ఆ టైమ్‌లో తీసిన ఫొటోలవి. ఇప్పుడైతే అంత సీన్ లేదులే’ అని డేర్‌గా చెప్పేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆ వేడి ఇంకా పూర్తిగా చల్లారకముందే... ఇటీవల ఓ భారీ స్టేట్మెంటే ఇచ్చేసి మళ్లీ పెద్ద చర్చకే తెరలేపింది. వివరాల్లోకెళితే... ఈ మధ్యే ఓ కోలీవుడ్ ఛానల్ ఇంటర్వ్యూలో సదరు చానల్ వ్యాఖ్యాత.. ఆండ్రియాపై చిలిపి ప్రశ్నల్ని సంధించాడు. ఆ ప్రశ్నలకు దీటుగానే కాక ఘాటుగా కూడా సమాధానమిచ్చేసింది ఆండ్రియా. పెదవి ముద్దు సన్నివేశంలో నటించాల్సి వస్తే... ఏ హీరోతో ఇష్టపడతారు? అనడిగితే -‘‘రణబీర్ కపూర్’’ అని తడుముకోకుండా జవాబివ్వడమే కాక.. ‘‘రణబీర్ చాలా ముద్దుగా ఉంటాడు. అతణ్ణి చూస్తేనే కిస్ చేయబుద్ధి అవుతుంది. అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను’’ అని బోల్డ్‌గా చెప్పేసింది ఆండ్రియా. ఇంకేముందీ... కార్యక్రమాన్ని చూస్తున్నవారు, తీస్తున్నవారు కూడా షాక్.