ఫ్లాప్ హీరోకి 38 కోట్లా..? | ranabir kapoor paid 38 crores for tamasha | Sakshi
Sakshi News home page

ఫ్లాప్ హీరోకి 38 కోట్లా..?

Published Fri, Dec 11 2015 1:41 PM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM

ఫ్లాప్ హీరోకి 38 కోట్లా..?

ఫ్లాప్ హీరోకి 38 కోట్లా..?

బాలీవుడ్ మోస్ట్ అన్ లక్కీ హీరో ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రణబీర్ కపూర్. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్న ఈ యంగ్ హీరో, హిట్ ఇవ్వడంలో మాత్రం వెనకపడుతున్నాడు. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో పాటు, నటుడిగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్న రణబీర్, ఇంత వరకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా ఇవ్వలేకపోయాడు.

అయితే తాజాగా ఈ హీరో ఇంటి మీద ఐటీ రైడ్స్ జరిగిన నేపధ్యంలో ఒక ఆసక్తి కరమైన విషయం బయటికి వచ్చింది. వరుస ఫ్లాప్ల తరువాత రణబీర్ హీరోగా నటించిన తమాషా సినిమాకు, ఈ హీరో ఏకంగా 38 కోట్ల రూపాయల భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. తన మార్కెట్ కన్నా కూడా రణబీర్ తీసుకున్న రెమ్యూనరేషనే ఎక్కువ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ యంగ్ హీరో నటించిన గత చిత్రం బాంబే వెల్వేట్ కేవలం 24 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ నేపథ్యంలో రణబీర్కు 38 కోట్లు ఇవ్వటంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అయ్యాయి.

ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన తమాషా సినిమాను 75 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. అయితే తొలి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పటివరకు కేవలం 61 కోట్లు మాత్రమే వసూళు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రణబీర్ రెమ్యూనరేషన్ బయటకు రావటంతో యూనిట్ సభ్యులు షాక్ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement