అతణ్ణి ముద్దాడే అవకాశమొస్తే వదలను! | iam ready to kiss with ranabhir kapoor : andria | Sakshi
Sakshi News home page

అతణ్ణి ముద్దాడే అవకాశమొస్తే వదలను!

Published Fri, Feb 7 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

అతణ్ణి ముద్దాడే అవకాశమొస్తే వదలను!

అతణ్ణి ముద్దాడే అవకాశమొస్తే వదలను!

 సినిమాల్లో తక్కువగా కనిపించడం, వివాదాల్లో ఎక్కువగా వినిపించడం ఆండ్రియా ప్రత్యేకత. అందం, అభినయంతో పాటు చక్కని గాన పటిమ కూడా ఉన్న ఆండ్రియా... సరిగ్గా ప్రయత్నిస్తే.. స్టార్ హీరోయిన్ అనిపించుకోవడం పెద్ద విషయమేం కాదు. కానీ... ఆ విషయాన్ని పక్కన పెట్టి, వివాదాలతోనే ఎక్కువగా సావాసం చేస్తుంటుంది ఈ చెన్నయ్ సుందరి. అందరూ సిగ్గుపడే అంశాలను సైతం లైట్‌గా తీసుకోవడం ఆండ్రియా స్పెషాలిటీ. ఆ మధ్య తన కంటే చిన్నవాడైన సంగీత దర్శకుడు అనిరుథ్‌తో ప్రేమాయణం నడిపింది. వారిద్దరి చుంబన దృశ్యాలు నెట్‌లో కూడా హల్‌చల్ చేశాయి. నీకంటే చిన్నాడితో ఆ పనేంటి? అని మీడియా అనడిగితే -‘‘ఇద్దరం ఇష్టపడ్డాం.
 
  ఆ టైమ్‌లో తీసిన ఫొటోలవి. ఇప్పుడైతే అంత సీన్ లేదులే’ అని డేర్‌గా చెప్పేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆ వేడి ఇంకా పూర్తిగా చల్లారకముందే... ఇటీవల ఓ భారీ స్టేట్‌మెంటే ఇచ్చేసి మళ్లీ పెద్ద చర్చకే తెరలేపింది. వివరాల్లోకెళితే... ఈ మధ్యే ఓ కోలీవుడ్ ఛానల్ ఇంటర్‌వ్యూలో సదరు చానల్ వ్యాఖ్యాత.. ఆండ్రియాపై చిలిపి ప్రశ్నల్ని సంధించాడు. ఆ ప్రశ్నలకు దీటుగానే కాక ఘాటుగా కూడా సమాధానమిచ్చేసింది ఆండ్రియా. పెదవి ముద్దు సన్నివేశంలో నటించాల్సి వస్తే... ఏ హీరోతో ఇష్టపడతారు? అనడిగితే -‘‘రణబీర్ కపూర్’’ అని తడుముకోకుండా జవాబివ్వడమే కాక.. ‘‘రణబీర్ చాలా ముద్దుగా ఉంటాడు. అతణ్ణి చూస్తేనే కిస్ చేయబుద్ధి అవుతుంది. అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను’’ అని బోల్డ్‌గా చెప్పేసింది ఆండ్రియా. ఇంకేముందీ... కార్యక్రమాన్ని చూస్తున్నవారు, తీస్తున్నవారు కూడా షాక్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement