
సాక్షి, ముంబై : బాలీవుడ్ లవ్‌బర్డ్స్ దీపికా-రణవీర్‌సింగ్ పెళ్లి ఫోటోల కోసం ప్రపంచమంతా కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసింది. ఎపుడెపుడు వారి వేడుక ఫోటోలను చూడాలా అని ఈ జంట అభిమానులతో పాటు సినీలోకమంతా ఆసక్తిగా నెట్‌లో వెతుకులాడుతోంది అంటే అతిశయోక్తి కాదేమో. చివరికి ఈ ఫోటోలు దర్శనమిచ్చాయి. స్వయంగా కొత్త పెళ్లి కూతురు దీపికా తన ట్విటర్ పోస్ట్ చేసి వేడుక చేసింది. అభిమానుల ముచ్చట తీర్చింది. అటు రణవీర్‌సింగ్ కూడా ట్విటర్‌లో అవే ఫోటోలను పోస్ట్ చేయడం విశేషం. దీంతో ఈ ఫోటోలు వైరల్‌గా మారిపోయాయి.
కాగా బుధవారం ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స్‌లో అత్యంత ఘనంగా దీపికా, రణవీర్‌లు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. దీప్‌వీర్ పెళ్లి తంతు రెండో రోజైన గురువారం సింధీ స్టయిల్లో జరిగిందట. రణవీర్ సింగ్, దీపికా పదుకోనే పెళ్లి ఫోటోలు కనీసం ఒక్కటి కూడా మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ రాలేదు. ఈ క్యూరియాసిటీపై పలు జోకులు సెటైర్లు కూడా పేలాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫన్నీ ఫోటోనే ఇందుకు నిదర్శనం.
— Deepika Padukone (@deepikapadukone) November 15, 2018
Comments
Please login to add a commentAdd a comment