
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హావెల్స్ ఇండియాకు కన్య్సూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ అయిన లాయిడ్ ప్రచార కర్తలుగా రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొనేలు వ్యవహరించనున్నారు. దీప్‌వీర్ జంట తమ ఉత్పత్తులైన ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మిషన్లు, టెలివిజన్లకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించనున్నారని లాయిడ్ సీఈఓ శశి అరోరా ప్రకటించారు. అమితాబ్ బచ్చన్ స్థానంలో వీరు నియమితులైనట్లు తెలిపారు.