జోడీ కట్టేదెవరో? | who's acts super star with jodi | Sakshi
Sakshi News home page

జోడీ కట్టేదెవరో?

Published Sat, Jan 24 2015 3:36 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

జోడీ కట్టేదెవరో? - Sakshi

జోడీ కట్టేదెవరో?

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఒకరు, యానిమేషన్‌లో మరొకరు ప్రత్యక్షంగా జోడీకట్టి రొమాన్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీస్ ఎవరన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎస్. వారిద్దరూ ఉత్తరాదిలో ఏలుతున్న దీపికా పదుకునే, సోనాక్షి సిన్హాలే. కాగా ఈ ముద్దుగుమ్మల్లో ఒకరు ఇళయదళపతితో జోడీ కట్టే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. విజయ్ తాజాగా శింబుదేవన్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథా చిత్రం పులిలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఆయనకు 58వ చిత్రం. ఇందులోవిజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఆయన సరసన శ్రుతిహాసన్, హన్సికలు నటిస్తున్నారు. కాగా విజయ్ 59వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి రాజారాణి చిత్రం ఫేమ్ అట్లి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి కథను రెడీ చేస్తున్నారు. పులి సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

తదుపరి అట్లి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే అది నిరాదార ప్రచారం అనేది తాజా సమాచారం. కాగా ఇప్పుడు విజయ్ సరసన నటించడానికి బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకునే, సోనాక్షి సిన్హాలలో ఒకరిని ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement