కలలకు సంకెళ్లు! | Sonakshi, Varun Sharma to head to Punjab for film | Sakshi
Sakshi News home page

కలలకు సంకెళ్లు!

Published Fri, Jan 25 2019 3:07 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Sonakshi, Varun Sharma to head to Punjab for film - Sakshi

సోనాక్షీ సిన్హా

మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి తన కలలను నిజం చేసుకోవాలనుకుంటుంది. కానీ ఆమె కలలకు కుటుంబ బాధ్యతలు సంకెళ్లు వేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ఆమెకు కుటుంబం నుంచి ఎలాంటి సహకారం లభించింది అనే అంశాల ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందనుంది. సోనాక్షీ సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తారు. ఈ సినిమాతో శిల్పీ దాస్‌ గుప్తా దర్శకునిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా షూటింగ్‌ నేడు పంజాబ్‌లో ప్రారంభం అవుతుంది.

‘‘మన చుట్టూ ఉండే ఎందరో అమ్మాయిల కథే ఈ సినిమా. ఇందులో నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో కేవలం ఎమోషన్స్‌ మాత్రమే కాదు.. ఫన్‌ కూడా ఉంటుంది. షూటింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు సోనాక్షీ  పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా నవ్విస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది. ప్రతి క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ లవ్‌లో పడిపోతారు’’ అని నిర్మాతల్లో ఒకరైన భూషణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇటీవలే ‘కళంక్‌’ మూవీ షూట్‌ను కంప్లీట్‌ చేసిన సోనాక్షి ప్రస్తుతం ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement