బిగ్‌ కోచ్‌ | Amitabh Bachchan collaborates with Nagraj Manjule for Jhund | Sakshi
Sakshi News home page

బిగ్‌ కోచ్‌

Published Thu, Sep 27 2018 12:18 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Amitabh Bachchan collaborates with Nagraj Manjule for Jhund - Sakshi

అమితాబ్‌ బచ్చన్‌

‘సైరాట్‌’ అనే మరాఠీ చిత్రంతో ఇతర భాషల వాళ్లు కూడా తనవైపు తిరిగి చూసేలా చేసిన దర్శకుడు నాగ్‌రాజ్‌ మంజులే. జాతీయ అవార్డు సాధించిన ఈ చిత్రం శ్రీదేవి కుమార్తె కథానాయికగా హిందీలో ‘ధడక్‌’ పేరుతో రీమేక్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగ్‌రాజ్‌ మంజులే ‘జుంద్‌’ ద్వారా హిందీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్యపాత్రలో నటించనున్నారు.

వీధి పిల్లలతో ఫుట్‌బాల్‌ టీమ్‌ని తయారు చేసే ప్రొఫెసర్‌ పాత్రను అమితాబ్‌ చేయనున్నారు. ‘‘అమితాబ్‌ లాంటి లెజెండ్‌ని డైరెక్ట్‌ చేయడం అంటే కల నిజమైనట్టే. మిగతా అందరూ దాదాపు కొత్తవాళ్లే నటిస్తారు’’ అన్నారు నాగరాజ్‌. నవంబర్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. 70 రోజులు షూటింగ్‌ జరిగే ఈ సినిమాలో అమితాబ్‌ 45రోజుల పాటు పాల్గొననున్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement