తోడు లేని హీరో! | Arjun Kapoor goes solo! India's Most Wanted to be a single hero film | Sakshi
Sakshi News home page

తోడు లేని హీరో!

Published Sat, Aug 25 2018 2:39 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Arjun Kapoor goes solo! India's Most Wanted to be a single hero film - Sakshi

అర్జున్‌ కపూర్‌

హీరోయిన్‌ లేకుండా సినిమా అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. లవ్‌ సీన్స్, డ్యూయెట్స్‌ వగైరాలు లేకుంటే ఏదో వెలితిగా ఉంటుంది. కానీ మా సినిమాలో స్ట్రాంగ్‌ కంటెంట్‌ ఉంది. హీరోయిన్‌ అవసరం లేదంటున్నారట అర్జున్‌ కపూర్‌ అండ్‌ టీమ్‌. రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వంలో అర్జున్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌’. ఇందులో అర్జున్‌ కపూర్‌ స్పైగా చేస్తున్నారు.

ఓ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ను పట్టుకునే పనిలో బిజీగా ఉండే హీరో లైఫ్‌లో లవ్‌ చాప్టరే లేదట. అందుకే ఈ టీమ్‌ హీరోయిన్‌ను వద్దనుకుంటున్నారని బాలీవుడ్‌ టాక్‌. అలా ఈ సినిమాలో అర్జున్‌ ప్రేయసి తోడు లేని హీరో అవుతున్నారు. మరోవైపు అర్జున్‌ నటించిన ‘నమస్తే ఇంగ్లాండ్, సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ చిత్రాల్లో పరిణీతీ చోప్రా తోడుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు అర్జున్‌ నటిస్తున్న ‘పానీపట్‌’లో కృతీసనన్‌ తోడుగా ఉన్న సంగతి తెలిసిందే. అన్నట్లు అర్జున్‌ నిజ జీవితంలోనూ తోడు లేని కుర్రాడే. అదే... ఇంకా పెళ్లి కాలేదని చెబుతున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement