
‘పద్మావతి’ తర్వాత దీపికా పదుకోన్ ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. విశాల్ భరద్వాజ్‌తో ఓ సినిమా ఒప్పుకున్నప్పటికీ ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యం పాలవ్వడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ మధ్యన ఓ సూపర్ హీరోయిన్ ఫిల్మ్‌లో యాక్ట్ చేస్తారని వార్త వచ్చినా అది కూడా ఇంకా ఐడియా దశలోనే ఉందట. మరో చిత్రం స్టేటస్ కూడా ఇంతే. శ్రీదేవి నటించిన ఓ సూపర్ హిట్ చిత్రం రీమేక్‌లో నటించనున్నారని తాజా ఖబర్.
నలభై ఏళ్ల క్రితం ఓ సౌత్ ప్రొడ్యూసర్ నిర్మాణంలో బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఒక శ్రీదేవి సూపర్ హిట్ చిత్రం ఆధారంగా ఈ సినిమా ఉంటుందట. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ విషయంలో బిజీగా ఉన్న టీమ్ అది కంప్లీట్ అవ్వగానే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. సో అప్పటి వరకు నెక్ట్స్ ఏంటీ? అంటే.. దీపికా దగ్గర నో ఆన్సర్.