
కొత్త సంవత్సరంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇంకా ఏం నిర్ణయించుకోలేదా? అయితే జాక్వెలీన్ ఫెర్నాండెజ్ దగ్గర్నుంచి చిన్న టిప్ తీసుకోవచ్చు. జాక్వెలీన్ ప్రస్తుతం ‘రేస్–3’లో యాక్ట్ చేస్తోంది. షూటింగ్ బ్రేక్‌లో మీడియా వాళ్లొచ్చి ‘హాయ్ జాక్’ అన్నారు. జాక్వెలీన్ నవ్వింది. ‘ఏంటి టెన్షన్‌గా ఉన్నారు? ఈ మూవీలో మీకు పోటీగా దీపికా పడుకోన్ లేదుగా?’ అన్నారు ఆ వచ్చినవాళ్లు! జాక్వెలీన్ మళ్లీ నవ్వింది. ‘రేస్–2’లో దీపిక, జాక్వెలీన్ నటించినప్పుడు అప్పట్లో అందరూ జాక్వెలీన్‌ని దీపికతో కంపేర్ చేశారు. ఇప్పుడు ‘రేస్–2’లో దీపిక లేకపోయినా మళ్లీ దీపికతోనే జాక్వెలీన్‌ని కంపేర్ చేస్తున్నారు.
అందుకే జాక్వెలీన్ నవ్వింది. నవ్వి ఊరుకోలేదు. ఊరుకుంటే మీడియా వాళ్లు ఊరుకోరని ఆమెకు తెలుసు. దీపిక లేదు కాబట్టి జాక్వెలీన్ హాయిగా, టెన్షన్ లేకుండా ‘రేస్–3’లో నటించేస్తోంది అని రాసేస్తారు. వాళ్లు అలా రాస్తారని కాదు కానీ, జాక్వెలీన్ చెప్పాలనుకున్నది చెప్పేసింది.. ‘నేనే కాదు, మీరు కూడా లైఫ్ కంపేరిజన్స్‌నిసీరియస్‌గా తీసుకోకండి’ అని! జాక్వెలీన్ సలహాని మీ కొత్త సంవత్సరం రిజల్యూషన్‌లలో ఒకటిగా చేర్చుకోవచ్చేమో థింక్ చెయ్యండి.
Comments
Please login to add a commentAdd a comment