బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్‌ముఖ్‌లను పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా 2024కి గాను భారతదేశపు ’అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు’ గా ఎంపిక చేసింది. జంతు సంక్షేమం పట్ల గల అంకితభావానికి, కారుణ్య జీవనశైలి నిబద్ధతకు గుర్తింపుగా వారికి ఈ గౌరవం లభించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘పనితో సంబంధం లేకుండా కూడా వెలుగులోకి రావడం ఆనందంగా ఉంది’ని ఈ సందర్భంగా తెలియజేసింది.
గతంలో హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీ అవార్డు టైటిల్ విజేతలలో జీనత్ అమన్, జాకీ ష్రాఫ్, ఫాతిమా సనా షేక్, రాజ్‌కుమార్ రావు, అలియా భట్, అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్, శ్రద్ధా కపూర్, సోనూసూద్, మానుషి చిల్లర్ .. వంటి సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. మానుషి చిల్లర్, సునీల్ ఛెత్రి, అనుష్క శర్మ, కార్తీక్ ఆర్యన్, విద్యుత్ జమ్వాల్, షాహిద్ కపూర్, రేఖ, అమితాబ్ బచ్చన్ లు కూడా అత్యంత అందమైన శాకా హారులుగా గుర్తింపు పొందారు.
ఈ యేడాది జాక్వెలిన్ తన స్టార్ పవర్‌ను అన్ని జంతువుల రక్షణ కోసం ఉపయోగించడంలో పేరొందింది. 50 ఏళ్లకు పైగా సంకెళ్లలో ఉంచిన ఏనుగును రక్షించిన #Freegajraj ప్రచారంతో సహా అనేక మార్గాల్లో పెటా ఇండియా పనికి మద్దతుగా తన అభిమానులను సమీకరించింది.
రితేష్ శాకాహారి. శాకాహారాన్ని ప్రోత్సహిస్తున్నాడు. భార్య జెనీలియాతో కలిసి శాకాహార మాంసం కంపెనీని కూడా స్థాపించాడు. ‘నటన నుంచి జంతు సంరక్షణ వరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్‌ముఖ్ నిజమైన సూపర్ స్టార్‌లుగా నిరూపితమయ్యారు’ అని పెటా ఇండియా సెలబ్రిటీ, పబ్లిక్ రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ బంగేరా తెలిపారు. ‘ఈ విధంగా దయను ప్రపంచానికి చూపినందుకు పెటా ఇండియా వారిని గౌరవించడం ఆనందంగా ఉంది. అన్నింటికన్నా వీరిది నాణ్యమైన అందం’ అని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment