
‘బేబీ.. హ్యాపీ వాలంటైన్స్ డే. ఈ ఏడాది మనకు ఎంతో సానుకూలంగా ప్రారంభమైంది. జీవితాంతం ప్రేమికుల రోజును మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. జాకీ.. నిజంగానే నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. ఈ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రియురాలివి. పిచ్చివాడిలా నిన్ను ప్రేమిస్తున్నా’ అంటూ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్( Jacqueline Fernandez )కు ప్రేమ లేఖ రాశాడు ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్ర శేఖర్(Sukesh Chandrashekhar). మరో జన్మంటూ ఉంటే జాక్వెలిన్ హృదయంగా జన్మిస్తానంటూ లేఖలో పేర్కొన్నాడు.
అంతేకాదు జైలులో ఉన్నప్పటికీ తన ప్రియురాలికి ప్రైవేట్ జెట్‌ను కానుకగా ఇచ్చాడు. ‘షూటింగ్స్ కోసం వివిధ దేశాలకు ప్రయాణిస్తుంటావు. అందుకే నీకోసం ఓ ప్రైవేట్ జెట్‌ని బహుమతిగా అందిస్తున్నాను. నీ పేరులోని తొలి అక్షరాలు ఆ జెట్‌పై రాసి ఉంటాయి. అదే విధంగా నీ పుట్టిన రోజు తేదీతో రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకున్నా. ఈ జెట్‌లో ఇకపై నీ ప్రయాణాలు సౌకర్యంగా జరుగుతాయి’ అని ప్రియురాలిపై తనకున్న ప్రేమనంతా లేఖ రూపంలో రాశాడు.
రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూల్ చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. ఆ తర్వాత బెయిల్ విషయాన్ని దాటవేశాడు. దీంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2021లో ఢిల్లీ పోలీసులు సుఖేశ్ అరెస్ట్ చేశారు. అతనితో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు.
జాక్వెలిన్ తన ప్రియురాలు అని సుఖేశ్ అంటుంటే.. అసలు అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్వెలిన్ చెబుతోంది. కోర్టులో కూడా ఇదే విషయం చెప్పింది. అయిన్పటికే సుఖేశ్ మాత్రం ప్రేమ లేఖలు రాస్తూనే ఉన్నాడు. బహుమతులు పంపిస్తూనే ఉన్నాడు. ఆమె బర్త్‌డేకి ఓ పెద్ద పడవను గిఫ్ట్‌గా అందించాడు. క్రిస్మస్ కానుకగా పారిస్‌లో ఒక వైన్ యార్డ్‌నే కానుకగా ఇస్తున్నట్లు లేఖ రాశాడు.
Comments
Please login to add a commentAdd a comment