sukesh chandrashekhar
-
డియర్ బ్రదర్ అంటూ.. కేజ్రీవాల్‌కు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. వీరిద్దరూ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్ట్‌పై తాజాగా సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్.. మీకు తీహార్ క్లబ్‌కు స్వాగతం పలుకుతున్నా అని రాసుకొచ్చాడు. దీంతో, ఆయన సుఖేష్ లేఖ హాట్ టాపిక్‌గా మారింది. కాగా, తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ రాశారు. తాజాగా కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈ లేఖలో స్పందించారు. ఇక, సుఖేష్ లేఖలో..‘ఆలస్యమైనా చివరకు నిజమే గెలుస్తుంది. సరికొత్త భారత్‌కు ఉన్న శక్తికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. బాస్ ఆఫ్ తీహార్ క్లబ్‌కు మీకు స్వాగతం పలుకుతున్నా. ఖట్టర్ ఇమాన్దార్ అనే డ్రామాలకు ముగింపు పడింది. మరో మూడు రోజుల్లో నా పుట్టినరోజు. మీ అరెస్ట్ నాకు పుట్టినరోజు బహుమతి లాంటిది. కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతం అవుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మొత్తం 10 కుంభకోణాలు చేశారు. నాలుగు కుంభకోణాలకు నేనే సాక్షిగా ఉన్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభం మాత్రమే. త్వరలోనే అప్రూవర్‌గా మారి నిజాలన్నీ బయటపెడతాను. ముగ్గురు వ్యక్తులు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ జైలులో ఉండటం నాకు ఆనందంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. Sukesh Chandrashekhar wrote a letter to #ArvindKejriwalSaid My Dear Kejriwal as the boss of Tihar Jail Club Pleased to welcome you. All your staunchly honest statements have come to an end. A.Chairman Big Boss- #ArvindKejriwalB.CEO- #ManishSisodiaC.COO- #SatyenderJain pic.twitter.com/J3bSBWlfOQ — Indian Observer (@ag_Journalist) March 23, 2024 కవితకు కూడా లేఖ.. ఇదిలాఉండగా.. కవిత అరెస్ట్ అనంతరం కూడా సుఖేష్ ఒక లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో కవితపై సెటైర్లు వేశారు. సదరు లేఖలో సుఖేష్.. ‘తీహార్ జైలు కౌంట్‌డౌన్ మీకు ప్రారంభమైంది. త్వరలో మీరు తీహార్ జైలు క్లబ్లో సభ్యులు కాబోతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదన అంతా బయటపడుతుంది. వాట్సాప్ చాటింగ్, కాల్స్‌పై దర్యాప్తు జరుగుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడే ప్రయత్నం చేయవద్దని నా సలహా. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు. ఈ కేసులో కావాల్సినన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలుసు. మీ అందరికీ తీహార్ జైలులో స్వాగతం పలికేందుకు నేను ఎదురుచూస్తుంటాను’ అని పేర్కొన్నాడు. -
కవితతో సుఖేష్ వాట్సాప్ చాట్.. ‘ఆ రేంజ్ రోవర్ కారు ఎవరిది?’
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎమ్మెల్సీ కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుఖేష్ చంద్ర లిక్కర్ స్కాంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కవితతో తాను చేసిన వాట్సాప్ చాటింగ్‌ను బయటపెట్టాడు. ఈ సందర్బంగా లిక్కర్ వ్యాపారంలో వచ్చిన డబ్బును హైదరాబాద్ నుంచి ఆసియా దేశాలకు హవాలా మార్గాల ద్వారా మళ్లించినట్లు సుఖేష్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాం కేసుపై బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు రంగంలోకి దిగారు. దీంతో, రఘనందన్ రావు తాజాగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. సుఖేష్ చంద్ర లేఖపై ఈడీకి ఫిర్యాదు చేశారు రఘనందన్. ఈ సందర్భంగా రఘనందన్ మాట్లాడుతూ.. కవిత, సుఖేష్ చంద్ర వాట్సాప్ చాటింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఈడీని కోరారు. సుఖేష్ వాట్సాప్ చాట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కారులో రూ.15 కోట్లు ఇచ్చినట్టు సంభాషణ ఉంది. నగదు ఉంచిన 6060 నెంబర్ రేంజ్ రోవర్ కారు ఎవరిది? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ పోలీసులు మౌనం వీడాలి. తెలంగాణ భవన్లో మనీలాండరింగ్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. -
జైల్లో సుకేష్ చంద్రశేఖర్ లగ్జరీ లైఫ్
-
డేటింగ్ చేయమని రోజు పది సార్లు కాల్ చేసేది.. నటిపై సంచలన ఆరోపణలు
సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరును కూడా ఈడీ చేర్చింది. అయి తే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వివరించాడు. మరో నటి నోరా ఫతేహిపై సంచలన ఆరోపణలు చేశాడు. నోరా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై ఎప్పుడూ అసూయపడేదని సుకేశ్ విచారణలో తెలిపాడు. తాను జాక్వెలిన్‌తో రిలేషన్లో ఉండగా.. తనను బ్రెయిన్‌వాష్ చేయడానికి ప్రయత్నించేదని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. నేను జాక్వెలిన్‌ను విడిచిపెట్టి ఆమెతో డేటింగ్ చేయాలని కోరిందని సుకేశ్ వివరించారు. నోరా నాకు రోజుకు కనీసం 10 సార్లు కాల్ చేసేదని ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. నోరా ఫతేహి ఈడీ ముందు తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చిందని ఆరోపించారు. ఆమె దుర్మార్గపు ఆలోచనలతో తమను మోసం చేసిందని పేర్కొన్నాడు. అయితే జాక్వెలిన్ ఇచ్చిన వాంగ్మూలంపై తాను మాట్లాడదలచుకోలేదని అన్నారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించిన వివరాలతో దిల్లీ పోలీసులు అనుబంధ ఛార్జిషీట్లో దాఖలు చేసినట్లు తెలుస్తోంది. జాక్వెలిన్ గురించి సుకేశ్ ప్రస్తావిస్తూ.. 'ఆమె నేను గౌరవించే వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ నా జీవితంలో భాగం. ఆమెతో నాతో ఉంటే సంతోషం. ఈ కేసు ఆమెను ఎలా ప్రభావితం చేసిందో నాకు తెలుసు. జాక్వెలిన్‌ను చూసుకోవడం నా బాధ్యత. ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.' అని అన్నారు. కాగా.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
సుకేశ్ నుంచి ఆప్ మంత్రికి నెలకి రూ.2కోట్లు.. చిక్కుల్లో కేజ్రీవాల్!
న్యూఢిల్లి: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్.. జైలు నుంచే అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిన విషయం తెలిసిందే. జైలులో అన్ని సౌకర్యాలు అందించేందుకు సుమారు 80 మందికిపైగా అధికారులకు లక్షల్లో ముడుపులు అందించాడు. ఇలా సుకేశ్ నుంచి లంచాలు పుచ్చుకున్న అధికారులు అతడికి సకల మర్యాదలు చేసినట్లు సమాచారం. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. తాను జైలులో సురక్షితంగా ఉండేందుకు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ముడుపులు ముట్టజెప్పానని వెల్లడించటం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు అందించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సుకేశ్ లేఖ రాసినట్లు తెలిసింది. తనను జైలులో తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, తనకు రక్షణ కల్పించేందుకు జైలులోనే ఉన్న సత్యేంద్ర జైన్‌కు ప్రొటెక్షన్ మనీ ఇచ్చానని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు సుకేష్ ఇచ్చినట్లు వెల్లడించింది. అందులో రాజ్యసభ నామినేషన్ కోసం రూ.50 కోట్లు తీసుకుందని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ఒక మోసాల పార్టీ అంటూ ఆరోపించింది. ఖండించిన కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు సుకేశ్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అవన్ని తప్పుడు ఆరోపణలని, గుజరాత్ ఎన్నికలు, మోర్బీ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసిన కుట్రగా ఆరోపించారు. ‘అన్ని కట్టుకథలు. మోర్బీ ఘటనపై దృష్టి మళ్లించే ప్రయత్నాలు. గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో వారు భయపడుతున్నారు. ఆప్ వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆర్థిక నేరస్థుడిని ఉపయోగించి సత్యేంద్ర జైన్‌పై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు.’ అని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇదీ చదవండి: Rs 200 crore extortion case: బాలీవుడ్ హీరోయిన్, భర్తకు ఈడీ షాక్ -
జైలు నుంచే అక్రమాలు.. లక్షల్లో ముడుపులు.. దిమ్మ తిరిగే షాకింగ్ విషయాలు
ఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అరెస్టై జైలుకు వెళ్లినా క్రమంలో.. అక్కడి నుంచే అన్ని కార్యక్రమాలు నడిపించాడు. అందుకోసం ఢిల్లీ రోహిణి జైలులోని 81మంది అధికారులకు సుకేష్ భారీగా లంచాలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత సుకేష్‌ను తిహార్ జైలుకు మార్చారు. ఇలా సుకేశ్ నుంచి లంచాలు పుచ్చుకున్న అధికారులు అతడికి సకల మర్యాదలు చేసినట్లు సమాచారం. జైలు బయట ఉన్న తన అనుచరులతో మాట్లాడేందుకు మొబైల్ ఫోన్ వంటివి అందించినట్లు దిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) తేల్చింది. సుకేష్ నుంచి ముడుపులు అందుకున్న జైలు అధికారులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. తన భార్య లీనాతో ఉండేందుకు ఒక్క రాత్రికే జైలు అధికారులకు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు సుకేష్ ఇచ్చినట్లు ఈఓడబ్ల్యూ అధికారులు తెలిపారు. ఇటీవలే జైలు ఆసుపత్రికి వెళ్లిన సుకేశ్.. అక్కడి నర్సింగ్ స్టాఫ్ సాయంతో అనుచరులతో మాట్లాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ దిశగానూ ఆర్థిక నేరాల విభాగం విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా.. తిహార్ జైలులో తమకు ప్రాణహాని ఉందని, దిల్లీ వెలుపలి జైలుకు తమని తరలించాలని గత నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు సుకేష్, ఆయన భార్య లీనా. జైలులో తమకు సాయం చేసినట్లు అనుమానిస్తున్న అధికారుల నుంచే తమకు ముప్పు ఉందని కోర్టుకు విన్నవించారు. దిల్లీ బయటి జైలుకు తమని మార్చాలని కోరారు. 2017లో ఎన్నికల సంఘం అధికారులకు లంచం కేసుకు సంబంధించిన మరో మనీలాండరింగ్ కేసులో గత ఏప్రిల్ 4న సుకేష్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అయితే.. ఇప్పటే ఆరోగ్య విభాగం ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ సహా పలువురు ప్రముఖ వ్యక్తులను మోసం చేసి కోట్ల రూపాయలు కాజేసిన నేరం కింద అరెస్టై జైలు జీవితం అనుభవిస్తున్నాడు సుకేష్. ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సహా పలువురు మోడల్స్‌ను ఈడీ ప్రశ్నించింది. ఇదీ చదవండి: జాక్వెలిన్‌కి ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడంలో సుకేశ్ భార్యదే కీలక పాత్ర -
ఆమెను తప్పుపట్టొద్దు.. సుకేష్ చంద్రశేఖర్ ఆసక్తికర లేఖ
బాలీవుడ్ బ్యూటీ, శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం సుకేష్ చంద్రశేఖర్‌తో రిలేషన్లో ఉండటమే. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అతడితో జాక్వెలిన్‌కు సంబంధం ఉన్నట్లు వార్తలు రావడం, తర్వాత అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో ఈ ముద్దుగుమ్మ చిక్కుల్లో పడింది. తన వ్యక్తిగత ఫొటోలను ప్రసారం చేయొద్దని జాక్వెలిన్ రిక్వెస్ట్ కూడా చేసింది. అయితే తాజాగా జాక్వెలిన్‌కు మద్దతుగా నిలిచాడు సుకేష్ చంద్రశేఖర్. ఆమెను తప్పుపట్టొద్దు అంటూ తన లాయర్‌తో ఓ ప్రకటన విడుదల చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోల గురించి తనకు వారం క్రితమే తెలిసిందని, ఆమెను చెడుగా చిత్రీకరించవద్దని కోరాడు. 'ఆ ఫొటోలు రావడం దురదృష్టకరం. అలా ఒక వ్యక్తి ప్రైవేసీకి భంగం కలిగించారు. నేను, జాక్వెలిన్ రిలేషన్షిప్లో ఉన్నామని గతంలోనే చెప్పాను. మేం స్వప్రయోజనాల కోసం డేటింగ్ చేశామని అనుకుంటున్నారు. కానీ, అది నిజం కాదు. ప్రేమతో మాత్రమే మా బంధాన్ని కొనసాగించాం. ఆమెను చెడుగా చిత్రీకరించడం మానుకోండి. నేను జాక్వెలిన్‌కు, ఆమె కుటుంబానికి ఇచ్చిన బహుమతులు, చేసిన పనులు ప్రేమించిన వ్యక్తి కోసం చేసినవి మాత్రమే. ఇది వ్యక్తిగతం. దీన్ని ఎందుకు ఇంతపెద్ద రాద్దాం చేస్తున్నారో తెలియట్లేదు. ఆమెకు ఈ కేసుతో సంబంధం లేదు. నేను చట్టబద్ధంగానే సంపాదించాను. అదే త్వరలో న్యాయస్థానంలో రుజువు అవుతుంది.' అని సుకేష్ చంద్రశేఖర్ తెలిపాడు. -
నటి ప్రేమికుడి అరెస్ట్
కేకేనగర్: ఐఏఎస్ అధికారి పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ప్రముఖ మలయాళ నటి ప్రేమికుడిని చెన్నై కేంద్ర నేర విభాగ పోలీసులు ముంబైలో అరెస్టు చేసి చెన్నై పుళల్ జైలులో నిర్బంధించారు. చెన్నై అంబత్తూరు పారిశ్రామికవాడలో ఫ్యూచర్ టెన్నిక్స్ అనే ప్రైవేటు సంస్థను బాలసుబ్రమణియన్ నడిపేవాడు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఐఏఎస్ అధికారి జయకుమార్ అనే వ్యక్తి బాలసుబ్రమణియన్‌కు పరిచయం అయ్యారు. అతడు కర్ణాటక ప్రభుత్వ పథకం కింద శానిటరీ నేప్కిన్ తయారు చేసే ఒప్పందాన్ని కుదురుస్తానని చెప్పారు. దీన్ని నమ్మిన బాల సుబ్రమణియన్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తన అకౌంట్ గల అంబత్తూరు కెనరా బ్యాంకు బ్రాంచ్‌లో మేనేజర్‌ను బాలసుబ్రమణియన్ సంప్రదించారు. బ్యాంకులో తాను ఐఏఎస్ అధికారి జయకుమార్ అని బాలసుబ్రమణియన్‌కు అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించడంతో బ్యాంకు రుణం ఇవ్వడానికి కెనరా బ్యాంక్ మేనేజరు జగదీష్ ఒప్పుకోవడంతో నకిలీ దస్తావేజులను సమర్పించి రూ.19 కోట్లను రుణం తీసుకున్న జయకుమార్ ఆ సొమ్ముకు జవాబుదారిగా బాలసుబ్రమణియన్ పేరు జత చేశారు. రుణం చెల్లించకపోవడంతో దీనిపై చెన్నై కేంద్ర నేర విభాగ పోలీసులకు కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. విచారణలో ఐఏఎస్ అధికారిగా నటించి మోసం చేసిన జయకుమార్ అసలు పేరు సుకాష్ చంద్రశేఖర్ అని, అతని ప్రియురాలు మలయాళ నటి లీనా మరియాపాల్ కలిసి నకిలీ దస్తావేజులను తయారు చేసి మోసానికి పాల్పడినట్లు తెలిసింది. ఇంకనూ బాలసుబ్రమణియన్ అకౌంట్ నుంచి రూ.19 కోట్లను ముంబైలో గల బ్యాంకు అకౌంట్‌కు చంద్రశేఖర్ మార్చుకున్న విషయం వెలుగుచూసింది. దీంతో బాలసుబ్రమణియన్, అతని భార్య, బ్యాంకు మేనేజర్ జగదీష్‌లను అరెస్టు చేశారు. ఇంకా సుకాష్ చంద్రశేఖర్‌ను ఢిల్లీనూ, అతని భార్య లీనా మరియాపాల్ను చెన్నై సేలయూరులో అరెస్టు చేశారు. సుకాష్ చంద్రశేఖర్‌పై ఇండియా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 25కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ముంబైలో అతడు జైలులో ఉన్నాడు. ముంబైకు వె ళ్లిన చెన్నై పోలీసులు అక్కడ జైలులో ఉన్న సుకాష్ చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. చెన్నైకు తీసుకువచ్చిన పోలీసులు అతడిని ఎగ్మూర్ న్యాయస్థానంలో హాజరు పరచి పుళల్ జైలుకు తరలించారు. త్వరలో అతడిని పోలీసు కస్టడీలో తీసుకుని విచారణ జరుపుతారు.