సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. వీరిద్దరూ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్ట్‌పై తాజాగా సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్.. మీకు తీహార్ క్లబ్‌కు స్వాగతం పలుకుతున్నా అని రాసుకొచ్చాడు. దీంతో, ఆయన సుఖేష్ లేఖ హాట్ టాపిక్‌గా మారింది.
కాగా, తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ రాశారు. తాజాగా కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈ లేఖలో స్పందించారు. ఇక, సుఖేష్ లేఖలో..‘ఆలస్యమైనా చివరకు నిజమే గెలుస్తుంది. సరికొత్త భారత్‌కు ఉన్న శక్తికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. బాస్ ఆఫ్ తీహార్ క్లబ్‌కు మీకు స్వాగతం పలుకుతున్నా. ఖట్టర్ ఇమాన్దార్ అనే డ్రామాలకు ముగింపు పడింది. మరో మూడు రోజుల్లో నా పుట్టినరోజు. మీ అరెస్ట్ నాకు పుట్టినరోజు బహుమతి లాంటిది. కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతం అవుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మొత్తం 10 కుంభకోణాలు చేశారు. నాలుగు కుంభకోణాలకు నేనే సాక్షిగా ఉన్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభం మాత్రమే. త్వరలోనే అప్రూవర్‌గా మారి నిజాలన్నీ బయటపెడతాను. ముగ్గురు వ్యక్తులు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ జైలులో ఉండటం నాకు ఆనందంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు.
Sukesh Chandrashekhar wrote a letter to #ArvindKejriwalSaid My Dear Kejriwal as the boss of Tihar Jail Club Pleased to welcome you. All your staunchly honest statements have come to an end. A.Chairman Big Boss- #ArvindKejriwalB.CEO- #ManishSisodiaC.COO- #SatyenderJain pic.twitter.com/J3bSBWlfOQ
— Indian Observer (@ag_Journalist) March 23, 2024
కవితకు కూడా లేఖ..
ఇదిలాఉండగా.. కవిత అరెస్ట్ అనంతరం కూడా సుఖేష్ ఒక లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో కవితపై సెటైర్లు వేశారు. సదరు లేఖలో సుఖేష్.. ‘తీహార్ జైలు కౌంట్‌డౌన్ మీకు ప్రారంభమైంది. త్వరలో మీరు తీహార్ జైలు క్లబ్‌లో సభ్యులు కాబోతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదన అంతా బయటపడుతుంది. వాట్సాప్ చాటింగ్, కాల్స్‌పై దర్యాప్తు జరుగుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడే ప్రయత్నం చేయవద్దని నా సలహా. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు. ఈ కేసులో కావాల్సినన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలుసు. మీ అందరికీ తీహార్ జైలులో స్వాగతం పలికేందుకు నేను ఎదురుచూస్తుంటాను’ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment