బాలీవుడ్ బ్యూటీ, శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం సుకేష్ చంద్రశేఖర్‌తో రిలేషన్లో ఉండటమే. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అతడితో జాక్వెలిన్‌కు సంబంధం ఉన్నట్లు వార్తలు రావడం, తర్వాత అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో ఈ ముద్దుగుమ్మ చిక్కుల్లో పడింది. తన వ్యక్తిగత ఫొటోలను ప్రసారం చేయొద్దని జాక్వెలిన్ రిక్వెస్ట్ కూడా చేసింది. అయితే తాజాగా జాక్వెలిన్‌కు మద్దతుగా నిలిచాడు సుకేష్ చంద్రశేఖర్. ఆమెను తప్పుపట్టొద్దు అంటూ తన లాయర్‌తో ఓ ప్రకటన విడుదల చేశాడు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోల గురించి తనకు వారం క్రితమే తెలిసిందని, ఆమెను చెడుగా చిత్రీకరించవద్దని కోరాడు. 'ఆ ఫొటోలు రావడం దురదృష్టకరం. అలా ఒక వ్యక్తి ప్రైవేసీకి భంగం కలిగించారు. నేను, జాక్వెలిన్ రిలేషన్షిప్లో ఉన్నామని గతంలోనే చెప్పాను. మేం స్వప్రయోజనాల కోసం డేటింగ్ చేశామని అనుకుంటున్నారు. కానీ, అది నిజం కాదు. ప్రేమతో మాత్రమే మా బంధాన్ని కొనసాగించాం. ఆమెను చెడుగా చిత్రీకరించడం మానుకోండి. నేను జాక్వెలిన్‌కు, ఆమె కుటుంబానికి ఇచ్చిన బహుమతులు, చేసిన పనులు ప్రేమించిన వ్యక్తి కోసం చేసినవి మాత్రమే. ఇది వ్యక్తిగతం. దీన్ని ఎందుకు ఇంతపెద్ద రాద్దాం చేస్తున్నారో తెలియట్లేదు. ఆమెకు ఈ కేసుతో సంబంధం లేదు. నేను చట్టబద్ధంగానే సంపాదించాను. అదే త్వరలో న్యాయస్థానంలో రుజువు అవుతుంది.' అని సుకేష్ చంద్రశేఖర్ తెలిపాడు.
Sukesh Chandrashekhar: ఆమెను తప్పుపట్టొద్దు.. సుకేష్ చంద్రశేఖర్ ఆసక్తికర లేఖ
Published Fri, Feb 4 2022 9:11 AM | Last Updated on Fri, Feb 4 2022 11:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment