Female Oriented Movie
-
యాక్షన్ స్టార్ట్
కీర్తీ సురేష్ లీడ్ రోల్లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. నూతన దర్శకుడు గణేష్‌రాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ఈ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీలో కీర్తీ సురేష్ సరికొత్త పాత్రలో కనిపిస్తారు. కథ, స్క్రీన్‌ప్లే, కథలో ఉన్న మలుపులన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసేలా ఈ యాక్షన్ మూవీ ఉంటుంది’’ అని ఎస్ఆర్ ప్రభు అన్నారు. -
రిస్క్ తీసుకొని హర్ చేశా
‘‘హర్’ సినిమా నా దగ్గరికి వచ్చినప్పుడు ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ నేను చేయగలనా? అని ఒక అనుమానం ఉండేది. కానీ డైరెక్టర్ శ్రీధర్‌గారు నాకు నమ్మకం ఇచ్చారు. రిస్క్ తీసుకొని మరీ ఈ సినిమా చేశాను’’ అని హీరోయిన్ రుహాని శర్మ అన్నారు. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో రుహాని శర్మ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘హర్’. డబుల్ అప్ మీడియాస్‌పై రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 21న ఈ మూవీ విడుదలవుతోంది. ఈ మూవీ ట్రైలర్‌ని హీరో వరుణ్ తేజ్ వర్చువల్‌గా లాంచ్ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌కి నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ–‘‘హర్’ నేను ఇప్పటికే చూశాను.. సినిమా చాలా బాగుంది. తప్పకుండా మంచి హిట్ అవుతుంది’’ అన్నారు. శ్రీధర్ స్వరాగవ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా మొదటి సీన్ నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. -
సమంత ఒప్పుకుంటే.. ‘యశోద’ సీక్వెల్ తీస్తాం: హరి, హరీష్
‘‘యశోద’ చిత్రాన్ని ఫిమేల్ ఓరియంటెడ్‌గా చేయాలనుకోలేదు. కొత్త పాయింట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చేశాం. మంచి సినిమా తీస్తే విజయం అందిస్తామంటూ మా నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. సమంత టైటిల్ రోల్లో హరి, హరీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సమంతగారి వన్ విమన్ షో ‘యశోద’. ఈ చిత్రం సీక్వెల్ గురించి చాలామంది అడుగుతున్నారు.. ఆ ప్రయత్నం హరి, హరీష్ నుంచి రావాలి. మా మూవీ ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.. అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంది’’ అన్నారు. ‘‘మాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. హరి, హరీష్ మాట్లాడుతూ– ‘‘యశోద’ మా తొలి తెలుగు చిత్రం. ‘యశోద 2’ విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా ఉంది. అయితే సీక్వెల్ సమంతగారిపై ఆధారపడి ఉంది’’ అన్నారు. మాటల రచయితలు పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ– ‘‘మీరు రాయగలరు.. రాయండి. మీ సక్సెస్ చూడాలని ఉంది’’ అని మమ్మల్ని ప్రోత్సహించిన కృష్ణప్రసాద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘యశోద’ని హిందీలో రిలీజ్ చేసిన యూఎఫ్ఓ లక్ష్మణ్, క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి, ఆర్టిస్టులు కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ, మధురిమ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజా సెంథిల్, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందు ఇబ్బందులు
ఇందు ఓ సింగిల్ అమ్మాయి. బాయ్‌ఫ్రెండ్ కోసం ఎందెందు వెతికినా దొరకలేదు. ఇక లాభం లేదని డేటింగ్స్ యాప్స్ అన్నీ చూడటం మొదలుపెట్టింది. మరి ఇందూకు జోడీ కుదిరిందా లేదా? అనేది తెలియాలంటే ‘ఇందూకీ జవానీ’ చిత్రం చూడాల్సిందే. కియారా అద్వానీ ముఖ్యపాత్రలో తెరకెక్కనున్న చిత్రం ఇది. బెంగాలీ దర్శకుడు అభిర్ సేన్ గుప్తా ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిఖిల్ అద్వానీ, నిరంజన్ అయ్యంగార్, ర్యాన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ‘‘న్యూ ఏజ్ కామెడీ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. డేటింగ్ సైట్లతో ఇందు పడ్డ ఇబ్బందులు చాలా సరదాగా ఉంటాయి. కియారా చేస్తున్న తొలి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ఇది’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘ఇందు పాత్ర చాలా సరదాగా ఉంటుంది. ఈ పాత్రను పోషించడానికి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని కియారా అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ప్రతి అమ్మాయి కనెక్ట్ అయ్యే కథతో...
‘మహానటి’ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో కీర్తీ సురేశ్‌పై అభిమానం అమాంతం పెరిగింది. ఇప్పుడు ఓ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో నటించనున్నారామె. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నరేంద్ర దర్శకత్వంలో మహేశ్ కోనేరు నిర్మించనున్నారు. ఈ సినిమా ముహూర్తం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్, దర్శకుడు వెంకీ అట్లూరి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో కల్యాణ్ రామ్ క్లాప్ ఇచ్చారు. ఫస్ట్ షాట్‌కి దర్శకుడు హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కీర్తీ సురేశ్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో ‘మహానటి’ తర్వాత నటిస్తోన్న సినిమా ఇది. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. ప్రతి అమ్మాయి కనెక్ట్ అయ్యే చిత్రమిది. సినిమా షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలో జరగనుంది. దర్శకుడు నరేంద్ర మంచి కథ సిద్ధం చేశారు. తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవుతాననే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘2016 నుంచి ఈ కథను తయారు చేస్తున్నాను. అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ఈ పాత్రకు కీర్తీగారు తప్ప ఇంకెవరూ సూట్‌కారు. 75శాతం షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు దర్శకుడు నరేంద్ర. ‘‘మహానటి’తో కీర్తి తెలుగు ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి అమ్మాయి ఏదో సందర్భంలో ఎదుర్కొన్న సంఘటన ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. మిగతా నటీనటులను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత మహేశ్ కోనేరు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కల్యాణ్ కోడూరి పాల్గొన్నారు. -
ఆ సినిమా ఆగలేదు
‘పద్మావత్’ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ నెక్ట్స్ మూవీ ఏంటి? అంటే ‘చపక్’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ అని చటుక్కున చెప్పొచ్చు. కానీ ఈ సినిమా అధికారికంగా వెల్లడవ్వక ముందు దీపిక ఓ ఫిమేల్ సూపర్ హీరో ఫిల్మ్ చేయబోతున్నారని బాలీవుడ్లో వార్తలు వచ్చాయి. తీరా ‘చపక్’ అనౌన్స్ కాగానే ఈ సినిమా ఆగిపోయిందని మాట్లాడుకున్నారు బాలీవుడ్ జనాలు. కానీ ఆ సినిమా ఆగిపోలేదు. ‘‘నేను సూపర్‌హీరో పాత్ర చేయబోయే సినిమా పూర్తిగా ఆగిపోలేదు. ఆ సినిమాపై నేను, నా ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాం. ఈ సినిమా కాస్త కొత్తగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత త్వరగా సెట్స్‌పైకి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకా పూర్తి కథ రెడీ కాలేదు. ఇప్పుడే విత్తు నాటాం. పెంచి పోషించడానికి కష్టపడుతున్నాం’’ అని ఓ ఇంటర్వ్యూలో దీపికా పేర్కొన్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ‘రాజీ’ ఫేమ్ మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపికా పదుకోన్ నటించినున్న ‘చపక్’ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో స్టార్ట్ కానుంది. ఇక దీపిక పర్సనల్ లైఫ్‌లోకి తొంగిచూస్తే... ఈ ఏడాది రణ్వీర్ సింగ్‌తో ఏడడుగులు వేసిన ఆమె న్యూ ఇయర్ వేడుకలతో పాటు తన బర్త్ డే వేడుకలను కూడా ఫారిన్లో ప్లాన్ చేశారు. జనవరి 5న దీపికా పుట్టినరోజని ప్రత్యేకించి చెపక్కర్లేదు. -
మార్పు రావాలి
‘‘హీరోల చుట్టూ తిరిగే కథల్లాగే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా ఎక్కువ రావాలి. బాలీవుడ్‌లాగా మాలీవుడ్‌లోనూ మార్పు రావాలి’’ అని పేర్కొన్నారు మలయాళ బ్యూటీ భావన. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ గురించి భావన మాట్లాడుతూ–‘‘ఇండస్ట్రీలో మార్పు రావాలి. కమర్షియల్ సినిమాల్లో కథ ఎక్కువగా హీరో చుట్టూనే తిరుగుతుంటుంది. హీరోయిన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉండదు. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ రెండు మూడు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంటాయి. ఒకవేళ ఎవరైనా హీరోయిన్ వరుసగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తుంటే అన్ని ఫీమేల్ స్టోరీలు డైరెక్ట్‌గా తనకే వెళ్లిపోతుంటాయి. కానీ బాలీవుడ్లో అలా కాదు. టాప్ యాక్ట్రెస్ అందరికీ సమానమైన అవకాశాలు వస్తుంటాయి. మన దగ్గర కూడా అలా జరగాలి’’ అని పేర్కొన్నారు భావన. -
నేను సైతం..
... అంటున్నారు కాజోల్. ఎందుకిలా అన్నారు? ఆమె ఏం చేయబోతున్నారు? అని తెలుసుకోవాలని ఉందా? మరేం లేదు. ఇప్పుడు కథానాయికలంతా లేడీ ఓరియంటెడ్ మూవీస్ వైపు మొగ్గు చూపుతున్నారు కదా! కాజోల్‌కి కూడా అలాంటి ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఈ ఇయర్ ఎండింగ్లో అది నెరవేరనుంది. వచ్చే ఏడాది ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీలో కాజోల్ కనిపిస్తారు. ఇటీవల తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ‘వీఐపీ 2’లో కాజోల్ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో లీడ్ రోల్లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని హీరో, కాజోల్ భర్త అజయ్ దేవగన్ నిర్మించనున్నారు. త్వరలో చిత్రీకరణ ఆరంభం కానుందట. -
ఆ నిజం ఎన్నాళ్లు దాచగలను!
ఇంటర్వ్యూ అందం, అభినయానికి చిరునామా అంజలి అంటే అతిశయోక్తి కాదు. అంజలి ఎంత బాగా నటించగలదో చెప్పడానికి ఒక్క ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చాలు. ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో నటించడంతో పాటు ‘గీతాంజలి’ వంటి ఫిమేల్ ఓరియంటెడ్ మూవీలో నటించి, సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోయగలనని నిరూపించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ‘చిత్రాగంద’తో పాటు తమిళంలో మూడు, నాలుగు చిత్రాలు చేస్తూ, బిజీగా ఉంది. ఇక.. అంజలి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం... ♦ నేనిప్పటివరకూ చేసినవన్నీ దాదాపు సాఫ్ట్ క్యారెక్టర్సే. కానీ, రియల్ లైఫ్‌లో నేనలా కాదు. కొంచెం టామ్ బోయ్ టైప్. చిన్నప్పట్నుంచీ అంతే. అమ్మాయిలా కాకుండా అబ్బాయిలానే పెరిగాను. అందుకే నా చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ అంతా నన్ను ‘టామ్ బోయ్’ అనేవాళ్లు. ♦ నేను రాజోలులో పుట్టా. మా అమ్మా, నాన్నలు ఉద్యోగాల నిమిత్తం విదేశాల్లో ఉండటంతో నేను మా నాయనమ్మ దగ్గరే పెరిగాను. దాదాపు నా స్కూలింగ్ అంతా అక్కడే. చిన్నప్పుడు అబ్బాయిలాగా ప్యాంట్, షర్ట్స్, షార్ట్స్ కూడా వేసుకునేదాన్ని. బాగా హైపర్ యాక్టివ్. చిన్నతనం నుంచి నా లక్ష్యం విషయంలో ఫుల్ క్లారిటీ ఉంది. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు మా టీచర్, ‘‘పెద్దయ్యాక ఏమవ్వాలను కుంటున్నారు’’ అని అడిగేవారు. మా క్లాస్మేట్స్ అందరూ డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్... ఇలా ఏవేవో చెప్పేవాళ్లు. నా వంతు వచ్చేసరికి ‘‘నేను సినిమా హీరోయిన్ అవుతా’’ అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ♦ నా వేషభాషలు చూసి చాలా మంది ‘నువ్ హీరోయిన్గా ట్రై చేయచ్చు కదా’ అని అడిగేవారు. నేను ఎయిత్త్ క్లాస్ చదువుతున్నప్పుడు అనుకుంటా... ఓ అబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు. చెడమడా తిట్టి, రాఖీ కట్టేశా. ఆ తర్వాత రోజు నా పక్కనున్న అమ్మాయిని చూడటం మొదలుపెట్టాడు. వాళ్లిద్దరి మధ్య ప్రేమలేఖల రాయబారాన్ని నడిపింది కూడా నేనే. ఈ విషయం బయటకు తెలిసి ఊళ్లో నా పేరు మారుమోగిపోయింది. ♦ ఇంట్లో తెలియకుండా స్కూల్ ఎగ్గొట్టి ఒకసారి ‘నువ్వే కావాలి’ సినిమాకు వెళ్లిపోయాను. ఈ విషయం తెలిసి మా ఇంట్లో చితక్కొట్టారు కూడా. ఇంకోసారి ఇంట్లో తెలియకుండా స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో డాన్స్ చేశాను. ఆ విషయం ఇంట్లో తెలిసిపోయిందని తెలిసి పారిపోయాను. నా గురించి మా వాళ్లు తెగ వెతికే శారు. నేను దొరికాక మాత్రం చాక్లెట్లు ఇచ్చి ఇంకెప్పుడూ అలా చేయొద్దన్నారు. ♦ రాజోలు నుంచి చెన్నైలోని మా పిన్ని దగ్గరకు వెళ్లిపోయాను. అక్కడే నా చదువు కొనసాగించా. ఊరు కాని ఊరు. భాష కాని భాష. దాంతో పాటు ఫ్రెండ్స్ కూడా లేరు. ఆ వెలితి తీర్చుకోవడానికి డ్యాన్స్, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నా. కానీ హీరోయిన్ అయ్యాక మాత్రం నా జీవితం, నా యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది. చిన్నప్పుడు ఎంత అల్లరిగా ఉండేదాన్నో, ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా పూర్తిగా సెలైంట్ అయిపోయాను. ♦ ఒకసారి మాకు తెలిసిన వాళ్ల పెళ్లి కోసమని రాజోలు వెళ్లాను. అక్కడ అందరూ గుర్తుపట్టి నాతో ఫొటోలు దిగుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. నాకు ఎవరో బోయ్‌ఫ్రెండ్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నాకు బోయ్‌ఫ్రెండ్ ఉన్నా ఎంత కాలమని దాస్తాను. ఇట్టే తెలిసిపోతుంది. ఈ రోజుల్లో ఏ విషయమైనా మీడియాకు తెలియకుండా ఉంటుందా? ఈ రోజు కాకపోతే మరొకరోజైనా తెలిసిపోతుంది. ♦ నేను ఒకే రకమైన పాత్రలు చేయాలని ఎప్పుడూ అనుకోను. గ్లామర్, డీ-గ్లామరైజ్డ్.. ఏ కార్యరెక్టర్ అయినా చేయడానికి సిద్ధమే. ఏ పాత్ర చేసినా అందులోకి పరకాయ ప్రవేశం చేయడానికి వంద శాతం కృషి చేస్తాను. పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ‘ఏమీ చేయలేదు’ అని బాధపడకూడదు. అందుకే మంచి పాత్రలు ఎంచుకుంటున్నాను. -
ముందు శాంపిల్... తర్వాత ఫుల్!
పదేళ్లుగా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కథానాయికగా చేయడంతో పాటు అతిథి పాత్రలూ, ఐటమ్ సాంగులూ చేస్తూ రాయ్ లక్ష్మి బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క హిందీ సినిమా అయినా చేయాలనీ, అది ఆషామాషీ సినిమా కాకూడదనీ ఎప్పట్నుంచో అనుకుంటున్నారామె. ఈ బ్యూటీ ఆశించిన విధంగానే బాలీవుడ్లో ఆమె ఎంట్రీ మామూలుగా జరగడంలేదు. సోనాక్షీ సిన్హా కథానాయికగా మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘అకిరా’లో అతిథి పాత్ర చేస్తున్నారామె. ఈ అతిథి పాత్ర చేయడం మొదలుపెట్టాక, ‘జూలీ 2’ అనే ఫిమేల్ ఓరియంటెడ్ మూవీలో అవకాశం దక్కింది. గతంలో హిందీలో నేహా ధూపియా చేసిన ‘జూలీ’కి ఇది సీక్వెల్ కాదు. ఇది వేరే కథతో రూపొందుతున్న చిత్రం. ఈ చిత్రానికి సంబంధించి రాయ్ లక్ష్మి ఫస్ట్ లుక్‌ని శనివారం విడుదల చేశారు. ‘‘ఇది శాంపిల్ మాత్రమే.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆదివారం మరో లుక్ విడుదలవుతుంది’’ అని రాయ్ లక్ష్మి ట్విట్టర్లో పేర్కొన్నారు. చెప్పినట్లుగానే మరో లుక్‌ని వేలంటైన్స్ డే స్పెషల్‌గా ఆదివారం విడుదల చేశారు. ఈ రెండు లుక్స్‌కీ అద్భుతమైన స్పందన లభిస్తోంది. ‘సూపర్ హాట్ గాళ్.. లవ్లీ’ అంటూ రాయ్ లక్ష్మి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. దీపక్ శివ్‌దాసాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాయ్ లక్ష్మి మొత్తం 25 నుంచి 30 రకాల లుక్స్‌లో, 90 రకాల కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారు. వాటిలో బికినీ కూడా ఉందని సమాచారం. నటిగా తనకిది 50వ చిత్రమనీ, ఈ చిత్రం ద్వారా కథానాయికగా హిందీ రంగానికి పరిచయం కావడం ఆనందంగా ఉందని రాయ్ లక్ష్మి అన్నారు. ఫస్ట్ లుక్ కోసం పది నుంచి పదకొండు కిలోల బరువు తగ్గారామె. ఆ తర్వాత తగ్గిన పది కిలోలతో పాటు అదనంగా ఇంకా బరువు పెరగమని దర్శకుడు అన్నారట. పాత్ర డిమాండ్ మేరకు రాయ్ లక్ష్మి తగ్గి, పెరిగారు. ‘‘ఓ కథానాయిక చుట్టూ సాగే చిత్రమిది. నటి కాకముందు ఆ అమ్మాయి జీవితం ఎలా ఉండేది? ఎలాంటి పరిస్థితుల్లో సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. వచ్చాక ఏం జరిగింది? అనే కథతో ఈ చిత్రం సాగుతుంది. అయితే, ఇది ఏ కథానాయిక జీవితానికి సంబంధించిన కథ కాదు’’ అని రాయ్ లక్ష్మి పేర్కొన్నారు. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
సిద్ధార్థతో ఆటాపాటా!
మనోజ్‌తో ‘పోటుగాడు’, అల్లరి నరేశ్‌తో ‘జేమ్స్‌బాండ్’ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు సాక్షీ చౌదరి. ప్రస్తుతం ఆమె సంగీత దర్శకుడు ఇస్మాయిల్ దర్బార్ దర్శకత్వంలో బాలీవుడ్లో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. సాక్షీకి తెలుగు నుంచి మరో మంచి ఆఫర్ వరించింది. ‘జీనియస్’, ‘రామ్‌లీలా’ చిత్రాల నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ‘సిద్ధార్థ’లో ఆమె నాయికగా ఎంపికయ్యారు. దయానంద్ రెడ్డి దర్శకత్వంలో ఆర్.కె. నాయుడు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో కథానాయికగా రాగిణీ నంద్వానీ నటిస్తున్నారు. దాసరి కిరణ్ మాట్లాడుతూ- ‘‘బుల్లితెర మెగాస్టార్ ఆర్.కె. నాయుడు ఇందులో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో జరగనున్న షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ: విసు, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, సంగీతం: మణిశర్మ, మాటలు: పరుచూరి బ్రదర్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముత్యాల రమేశ్, సమర్పణ: లంకాల బుచ్చిరెడ్డి.