నేను సైతం.. | Kajol to play a single mother in Pradeep Sarkar-Ajay Devgn's next movie | Sakshi
Sakshi News home page

నేను సైతం..

Published Fri, Nov 17 2017 12:39 AM | Last Updated on Fri, Nov 17 2017 12:39 AM

 Kajol to play a single mother in Pradeep Sarkar-Ajay Devgn's next movie - Sakshi

... అంటున్నారు కాజోల్‌. ఎందుకిలా అన్నారు? ఆమె ఏం చేయబోతున్నారు? అని తెలుసుకోవాలని ఉందా? మరేం లేదు. ఇప్పుడు కథానాయికలంతా లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు కదా! కాజోల్‌కి కూడా అలాంటి ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఈ ఇయర్‌ ఎండింగ్‌లో అది నెరవేరనుంది.

వచ్చే ఏడాది ఓ ఫిమేల్‌ ఓరియంటెడ్‌ మూవీలో కాజోల్‌ కనిపిస్తారు. ఇటీవల తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ‘వీఐపీ 2’లో కాజోల్‌ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రదీప్‌ సర్కార్‌ దర్శకత్వంలో లీడ్‌ రోల్‌లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. ఈ చిత్రాన్ని హీరో, కాజోల్‌ భర్త అజయ్‌ దేవగన్‌ నిర్మించనున్నారు. త్వరలో చిత్రీకరణ ఆరంభం కానుందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement