ఐ యామ్‌ బ్యాక్‌.. ఏదో ఒకరోజు..! | Vijay Devarakonda Next Pre look poster out | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 9 2018 9:31 AM | Last Updated on Fri, Feb 9 2018 12:03 PM

Vijay Devarakonda Next Pre look poster out - Sakshi

విజయ్‌ దేవరకొండ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, సినిమా : టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండ సినీ ప్రయాణం చాలా వైవిధ్యభరితంగా ముందుకు సాగుతోంది. అర్జున్‌ రెడ్డి తర్వాత ఇతగాడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోవటంతో చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్‌ చేతిలో అరడజను ప్రాజెక్టులు ఉండగా... అందులో ఓ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇట్స్‌ టైమ్‌.. ఐ యామ్‌ బ్యాక్‌... అంటూ విజయ్‌ దేవరకొండ తన ట్విటర్‌లో ఈ చిత్ర ప్రీలుక్‌ పోస్టర్‌ను ఉంచాడు. దుమ్ము రేపుతున్న టాక్సీ పోస్టర్‌ కింద ‘ఫస్ట్‌ లుక్‌ ను ఏదో ఒక రోజు విడుదల చేస్తాం’ అన్న క్యాప్షన్‌ కింద కనిపిస్తోంది. రాహుల్ సంకృత్యన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో విజయ్‌ క్యాబ్‌ డ్రైవర్‌ రోల్‌లో కనిపించబోతుండగా.. షార్ట్‌ ఫిలింస్‌ బ్యూటీ ప్రియాంక జవల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆసక్తికర టైటిల్‌ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement