తమిళసినిమా: ఆరంభంలోనే తుళ్లువదో ఇళమై అనే చిన్న చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన నటుడు ధనుష్. ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ వరకు ఎదిగారు. టాలీవుడ్‌నూ వదల్లేదు. తెలుగులో ధనుష్ నటించిన వాత్తి అనే ద్విభాషా చిత్రం (తెలుగులో సార్ పేరుతో) త్వరలో విడుదలకు ముస్తాబవుతుంది. అదే విధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో చిత్రం కూడా కమిట్ అయ్యారు. తాజాగా తిరుచ్చిట్రం ఫలం చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. కాగా ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు.
చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి
ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. కాగా ధనుష్ తాజాగా ఓ మైల్‌స్టోన్‌ను టచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అదే తన 50వ చిత్రం. ఇంతకు ముందు తిరుచ్చిట్రం ఫలం చిత్రాన్ని నిర్మించిన సన్‌పిక్చర్స్ సంస్థనే ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మించనుంది. ఇంతకు ముందు రజనీకాంత్ కథానాయకుడిగా అన్నాత్తే చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థ ప్రస్తుతం అదే రజనీకాంత్ హీరోగా జైలర్ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, తెలుగు నటుడు సునీల్, నటి రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్రలో మెరవనున్నారు.
చదవండి: ట్రోల్స్‌పై స్పందించిన గోపీచంద్ మలినేని
నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. మిగతా షూటింగ్ ఏప్రిల్ నెలాఖరుకి పూర్తి చేసి చిత్రాన్ని ఆగస్టులో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా తదుపరి సన్ పిక్చర్స్ సంస్థ ధనుష్ హీరోగా నటించే చిత్రాన్ని నిర్మించనుంది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం వంటి వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment