
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. ఆయన తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా నటుడు, గాయకుడు, నిర్మాత, దర్శకుడు ఇలా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. అలా నటుడిగా 50 చిత్రానికి రెడీ అయిపోయారు. ఇటీవలే తన 49వ చిత్రం కెప్టెన్ మిల్లర్ షూటింగ్ పూర్తి చేసిన ధనుష్ తాజాగా మరో చిత్రానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైనట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
(ఇది చదవండి: 'సలార్' టీజర్ ఓకే.. కానీ డైరెక్టర్‌ని ఓ విషయంలో మెచ్చుకోవాలి!)
ఆ పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న నటుడు ధనుష్ తనే దర్శకత్వం వహించనుండడం మరో విశేషం. నటుడు ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో నటి అపర్ణ బాలమురళి, నటుడు విష్ణు విశాల్, సందీప్ కిషన్, నటి దుషార విజయన్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఇందులో ధనుష్ సరసన నటి అమలాపాల్ నటించనున్నట్లు సమాచారం. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్స్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
(ఇది చదవండి: ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి)
#D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5
— Dhanush (@dhanushkraja) July 5, 2023