నయన్‌కు మరో క్రేజీ ఆఫర్‌.. స్టార్‌ డైరెక్టర్‌ సినిమాలో ఛాన్స్! | Nayanthara Gets Crazy Offer Once Again In Bollywood, Talk Goes Viral - Sakshi
Sakshi News home page

Nayanthara Bollywood Movie Offer: నయనతారకు క్రేజీ ఆఫర్.. సూపర్ హిట్‌ డైరెక్టర్‌తో!

Published Fri, Apr 19 2024 7:02 AM | Last Updated on Fri, Apr 19 2024 10:26 AM

Nayanthara Gets Crazy Offer Once Again In Bollywood Goes Viral - Sakshi

దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార మరో బాలీవుడ్‌ చిత్రానికి రెడీ అవుతున్నారా? అన్న ప్రశ్నలకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఒక పక్క పిల్లలు, భర్త అంటూ సంసార జీవితంలో ఎంజాయ్‌ చేస్తునే మరో పక్క నటిగా బిజీగా ఉన్న ఏకై క నటి నయన్. దక్షిణాదిలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార చాలా కాలంగా తరువాత ఇటీవలే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమె నటించిన తొలి చిత్రం జవాన్‌ సూపర్‌హిట్‌ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్‌ను పూర్తి చేశారు. 

అందులో ఒకటి మన్నాంగట్టి సిన్స్‌ 1960. దర్శకుడు డ్యూడ్‌ విక్కీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటుడు యోగిబాబు, దేవదర్శిని, గౌరి కిషన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యాన్‌ లోల్డన్‌ సంగీతం, ఆర్‌డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ గత ఏడాది ప్రారంభమైంది. ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రంగా రూపొందుతోంది. కాగా ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అయితే నయనతార తన పోర్షన్‌ను పూర్తి చేశారట. 

అలాగే ఈమె నటిస్తున్న మరో చిత్రం టెస్ట్‌. నటుడు మాధవన్‌, విజయ్‌ సేతుపతి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శశికాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్‌ క్రీడ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా జవాన్‌ చిత్రంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సక్సెస్‌ను అందుకున్న నయనతారకు అక్కడ మరో సూపర్‌ అవకాశం వరించినట్లు తాజా సమాచారం. సూపర్‌ హిట్స్‌ చిత్రాల దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఈమె నాయకిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
 
Advertisement