
తన వయసు నాలుగు పదులు.. అయినా ఎక్కడా తగ్గేదేలే అంటోంది నయనతార. ఇంతకుముందు వివాదాలకు ఇప్పుడు సంచలనాలకు కేంద్రం ఈ బ్యూటీ. సినిమాల్లో నటిస్తూనే ఇతర వ్యాపార రంగాల్లోనూ దూసుకుపోతోంది. మరో పక్క దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు తల్లి కూడా అయింది. అయినప్పటికీ లేడీ సూపర్‌స్టార్ పట్టం చేజారకుండా చూసుకుంటోంది.
బాలీవుడ్‌లోనూ నయన్‌కు క్రేజ్
అగ్ర కథానాయికగా ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఇటీవల బాలీవుడ్‌లో తన లక్ పరీక్షించుకుంది. అక్కడ షారుక్ ఖాన్‌తో జత కట్టిన జవాన్ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి రికార్డులను బ్రేక్ చేయడంతో ఈ అమ్మడి క్రేజ్ అక్కడ కూడా పెరిగిపోయింది. దీంతో బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు నయనతార తలుపు తడుతున్నాయని సమాచారం. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలి తాజా చిత్రంలో నయనతార ఒక ముఖ్యపాత్రలో నటింపజేయడానికి సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న హీరోయిన్
కాగా జవాన్ చిత్రానికి రూ.10 కోట్లు పుచ్చుకున్న నయనతార ఈ చిత్రానికి ఏకంగా రూ.13 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అలా ఏ విషయంలోనూ తగ్గేదేలే అంటూ ముందుకు పోతోందన్నమాట. ప్రస్తుతం ఈమె తమిళంలో తన 75వ చిత్రంతోపాటు, క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న టెస్ట్, మన్నాంగట్టిసిన్స్ 1960 చిత్రాల్లో నటిస్తోంది. నటుడు జయం రవి సరసన మరోసారి తనీ ఒరువన్–2 చిత్రంలో నయనతార నటించనున్నట్లు టాక్ నడుస్తోంది.
చదవండి: మేము విడిపోయామంటూ శిల్పాశెట్టి భర్త ట్వీట్.. నెట్టింట వైరల్
Comments
Please login to add a commentAdd a comment