స్వీయ దర్శకత్వంలో మరో స్టార్ హీరో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్‌ లుక్! | Kollywood Star Hero Dhanush Latest Movie First look and Title Revealed | Sakshi
Sakshi News home page

Dhanush 50: ధనుశ్ 50వ చిత్రం.. కీలక పాత్రలో తెలుగు హీరో.. టైటిల్‌ ఇదే!

Published Mon, Feb 19 2024 9:15 PM | Last Updated on Mon, Feb 19 2024 9:31 PM

Kollywood Star Hero Dhanush Latest Movie First look and Title Revealed - Sakshi

ఇటీవలే కెప్టెన్‌ మిల్లర్‌తో సూపర్‌ కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ధనుశ్ మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ధనుశ్-50 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 

ధనుశ్ కెరీర్‌లో 50వ సినిమాగా నిలవనుంది. తాజాగా రిలీజైన ఫస్ట్‌లుక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు రాయన్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమా కథను తానే రాయడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు ధనుశ్. ఈ చిత్రంలో  కెప్టెన్‌ మిల్లర్‌లో కీలక పాత్ర పోషించిన సందీప్ కిషన్‌ కూడా నటిస్తున్నారు. 

ఇదే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో  తెలుగు సినిమాలో ధనుష్‌ నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్‌లో 51వ చిత్రం. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement