
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఇటీవల రాయన్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 26న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే రాయన్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
తాజాగా ఇవాళ ధనుశ్ బర్త్ డే కావడంతో చిత్రబృందం, అభిమానులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. అంతే కాకుండా సన్ పిక్చర్స్ సంస్థ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ధనుశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రాయన్ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment