ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'రాయన్'. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 26న విడుదలైన ఈ చిత్రం మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించేలా రాయన్ ఉందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ఇలా స్టార్ యాక్టర్స్ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కానీ ఆ అంచనాలను రాయన్ చేరుకోలేకపోయింది.
రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ధనుష్ స్వీయ దర్శకత్వం వహించాడు. సినిమాపై మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ రాయన్‌కు ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చాయని తెలుస్తోంది. ధనుష్‌కి తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. సార్, తిరు లాంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు.
ఇండస్ట్రీ లెక్కల ప్రకారం రాయన్ మూవీ విడుదలైన తొలి రోజు భారత్‌లో రూ. 13.65 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ వసూళ్లలో తెలుగు వెర్షన్ నుంచి రూ. 1.6 కోట్లు రాగా తమిళ వెర్షన్‌కు రూ. 11.85 కోట్లు వచ్చాయి. అయితే హిందీ నుంచి కేవలం రూ. 20 లక్షలు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.20.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment