
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'రాయన్'. యాక్షన్ ఎంటర్‌టైనర్ స్టోరీతో తీయగా.. ధనుష్ హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. తెలుగు హీరో సందీప్ కిషన్‌తో పాటు కాళీదాస్ జయరం, అపర్ణ బాలమురళి, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సూపర్ హిట్ అవగా.. తెలుగులో ఓకే ఓకే అనేలా ఆడింది.
(ఇదీ చదవండి: సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో)
మొన్నీమధ్య అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసిన ఈ చిత్రానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రాయన్'ని మరో ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మూవీని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థకు సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఉంది. ఇందులోకే ఇప్పుడు రాయన్ అందుబాటులోకి వచ్చింది. కాకపోతే విదేశీ ఓటీటీ ప్రియులకు మాత్రమే ఈ యాప్‌లో 'రాయన్' స్ట్రీమింగ్ అవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనని స్వయంగా సన్ నెక్స్ట్ పోస్ట్ చేసింది.
'రాయన్' విషయానికొస్తే.. రాయన్ (ధనుష్) ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతుంటాడు. ఇతడికి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లి ఉంటుంది. గుట్టుగా బతుకున్న వీళ్ల జీవితం.. రాయన్ తమ్ముడు వల్ల ఊహించని చిక్కులు ఎదుర్కొంటుంది. కుటుంబంలో ఒకరిని ఒకరు చంపుకొనేంత వరకు వెళ్తారు. అసలు దీనికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: హీరో భార్యకు తప్పని బాడీ షేమింగ్.. పోస్ట్ వైరల్)
Comments
Please login to add a commentAdd a comment