హీరో భార్యకు తప్పని బాడీ షేమింగ్.. పోస్ట్ వైరల్ | Randeep Hooda Wife Lin Laishram Body Shamed By Women | Sakshi
Sakshi News home page

Lin Laishram: ఆ సామెతని నిజం చేసేలా ప్రవర్తించొద్దు

Published Wed, Aug 28 2024 5:22 PM | Last Updated on Wed, Aug 28 2024 5:56 PM

Randeep Hooda Wife Lin Laishram Body Shamed By Women

బాలీవుడ్ నటుల్లో రణ్‌దీప్ హుడా ఒకరు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది నవంబరులో మోడల్, నటి లిన్ లైష్రామ్‪‌ని పెళ్లి చేసుకున్నాడు. ఈమెది మిజోరాంలో ఇంఫాల్. తాజాగా తన ప్రాంతంలోని చేనేత కార్మికులకు సపోర్ట్ చేస్తూ వాళ్లు తయారు చేసిన దుస్తుల్లో ర్యాంప్ వ్యాక్ చేసింది. బాడీ పాజిటివిటీ గురించి మంచిగా రాసుకొచ్చింది.

ఊహించని విధంగా ఈ ఫొటోలకు దిగువన ప్రశంసల కంటే ట్రోల్స్ ఎక్కువొచ్చాయి. అదీ కూడా చాలామంది అమ్మాయిలు ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేయడంతో తాను చాలా బాధపడ్డాడని లిన్ లైష్రామ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆడదానికి ఆడదే శత్రువు అనే సామెతని నిజం చేసేలా ప్రవర్తించొద్దని కాస్త ఘాటుగానే స్పందించింది.

(ఇదీ చదవండి: సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో)

'నా బరువు గురించి తోటి మహిళలు జోకులు వేయడం చూసి షాకయ్యా. ఇది నిజంగా చాలా బాధాకరం. వాళ్లు నా స్థానంలో ఉండి ఆలోచించాలి. బొద్దుగా ఉ‍న్నా సరే ర్యాంప్‌పై రప్ఫాడించాను. మీ ఊహలకు అందని విధంగా కనిపించాను. 'ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువు' అనే సామెతని నిజం చేసేలా ఇలా నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు. దీనికి బదులు ఒకరికొకరు అండగా నిలబడింది' అని లిన్ లైష్రామ్ తన బాధని చెప్పుకొచ్చింది.

ఇక లిన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'బన్ టిక్కీ' అనే సినిమా చేస్తోంది. ఇందులో జీనత్ అమన్, షబానా అజ్మీ, అభయ్ డియోల్ ప్రధాన పాత్రధారులు. ఫరాజ్ అరిఫ్ అన్సారి దర్శకుడు.

(ఇదీ చదవండి: తమన్నా-విజయ్ వర్మ ప్రేమ.. ఏకంగా 5000 ఫొటోలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement