మూడు నెలల కిందట నటుడి పెళ్లి.. పిల్లల కోసం ప్లానింగ్‌! | Randeep Hooda Says Lin Laishram Changing His Perspective towards Life: We Wanted to have Babies | Sakshi
Sakshi News home page

Randeep Hooda: నా లైఫ్‌లోకి భార్య వచ్చాకే అదంతా మారింది.. అంతకుముందు..

Published Wed, Feb 14 2024 3:52 PM | Last Updated on Mon, Feb 26 2024 5:53 PM

Randeep Hooda Says Lin Laishram Changing His Perspective towards Life: We Wanted to have Babies - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్‌ హుడా ఇటీవలే వైవాహిక జీవితాన్ని ఆరంభించాడు. నవంబర్‌ 29న ప్రియురాలు, నటి లిన్‌ లైస్రామ్‌ను పెళ్లాడాడు. లిన్‌ మణిపూర్‌ నివాసి కావడంతో అక్కడి సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. రణ్‌దీప్‌ కంటే లిన్‌ పదేళ్లు చిన్నది. ఇకపోతే 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న రణ్‌దీప్‌ భార్యతో కలిసి ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు.

తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. మా ప్రేమను గెలిపించుకుని ఒక్కటయ్యాం. ఇప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తున్నాం. ఫ్యామిలీని పెద్దది చేయాలనుకుంటున్నాం. మొదట్లో నేను నా వృత్తిని అంతగా పట్టించుకునేవాడిని కాదు. దేన్నీ పెద్దగా లెక్కచేసేవాడిని కాదు. కానీ లిన్‌ నా జీవితంలోకి వచ్చాక అంతా కొత్తగా అనిపిస్తోంది. జీవితాన్ని భిన్నంగా చూస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.

సినిమాల సంగతి..
రణ్‌దీప్‌ హుడా 'మాన్‌సూన్ వెడ్డింగ్' ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. 'వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై', 'సాహెబ్‌, బివి ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌', సల్మాన్‌ ఖాన్‌ 'కిక్‌', 'రంగ్‌ రాసియ', 'జిస్మ్‌ 2' తదితర చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా స్వతంత్ర వీర్‌ సావర్కర్‌ మూవీని తానే స్వయంగా తెరకెక్కిస్తున్నాడు. డైరెక్షన్‌ చేయడమే కాకుండా ఇందులో సావర్కర్‌గా నటిస్తున్నాడు. లిన్‌ విషయానికి వస్తే.. ఓం శాంతి ఓం, మేరీ కోమ్, మాతృ కి బిజిలీ కా మండోలా, రంగూన్ ఆక్సోన్, జానే జాన్‌ వంటి చిత్రాలలో నటించింది.

చదవండి: 22 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌.. కడ వరకు ప్రేమకు సరైన నిర్వచనంగా నిలిచిన జంట

- పోడూరి నాగ ఆంజనేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement