నోటు కథేంటి? | Nagarjuna First Look Glimpse Released From Dhanush Kubera Movie | Sakshi
Sakshi News home page

నోటు కథేంటి?

Published Fri, May 3 2024 12:36 AM | Last Updated on Fri, May 3 2024 12:36 AM

Nagarjuna First Look Glimpse Released From Dhanush Kubera Movie

ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయిక. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ (ఏషియన్‌ గ్రూప్‌ యూనిట్‌), అమిగోస్‌ క్రియేషన్స్‌పై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి నాగార్జున ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు. వర్షం కురుస్తుండగా గొడుగు పట్టుకుని నిల్చున్నారు నాగార్జున. 

ఆయన వెనకవైపు డబ్బు నోట్ల కట్టలు ఉన్న కంటైనర్‌ కనిపిస్తోంది. కాగా.. ఓ ఐదువందల రూపాయల నోటు కింద పడి ఉండటాన్ని చూసిన నాగార్జున తన పర్సులోంచి ఓ నోటుని తీసి, ఆ కంటైనర్‌లో పెడతారు. మరి.. ఆ నోటు వెనక కథేంటి అనేది సినిమాలో చూడాల్సిందే. ‘‘వైవిధ్యమైన కథాంశంతో ‘కుబేర’ రూపొందుతోంది. ఈ చిత్రం కోసం బ్యాంకాక్‌లో నాగార్జున, ఇతర నటీనటులపై కొంత టాకీ, యాక్షన్‌ పార్ట్‌ చిత్రీకరించాం. ప్రస్తుతం ముంబైలో షూటింగ్‌ జరుగుతోంది’’ అని యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement