తమిళ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా చేస్తూనే నిర్మాత, దర్శకుడిగానూ ఆశ్చర్యపరుస్తున్నారు. గతేడాది తెలుగులో 'సార్' చిత్రంలో నటించి హిట్ కొట్టారు. రీసెంట్‌గా 'కెప్టెన్ మిల్లర్' అనే మూవీతో పలకరించారు. కానీ ఇది అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న ధనుష్.. స్వీయ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!)
సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ తీస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. అనికా సురేంద్రన్, దుషారా విజయన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే ఈ మూవీకి 'రాయన్' అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వేసవికి ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. తాజాగా ధనుష్.. దర్శక నిర్మాతగా మరో సినిమా తీయబోతున్నట్లు సమాచారం. తన సోదరి కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఈ మూవీ చేయబోతున్నారట. ఇందులో ధనుష్ అతిథి పాత్రలోనూ నటిస్తారని టాక్. ఈ ప్రాజెక్ట్ గురించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ హీరో ధనుష్‌కి తోడబుట్టిన అన్న. అలానే వీళ్లిద్దరికీ ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. వీళలో ఒకరి అబ్బాయినే ఇప్పుడు ధనుష్, హీరోగా పరిచయం చేయబోతున్నాడనమాట.
(ఇదీ చదవండి: నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు పెళ్లి.. కేసీఆర్‌కి ఆహ్వానం)
Comments
Please login to add a commentAdd a comment