తొలి రోజు.. కొత్త కబుర్లు | 1 jan 2019 new movies official announcements and details | Sakshi
Sakshi News home page

తొలి రోజు.. కొత్త కబుర్లు

Dec 30 2018 4:35 AM | Updated on Apr 7 2019 12:28 PM

1 jan 2019 new movies official announcements and details - Sakshi

మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, సూర్య, నాని

సెలబ్రేషన్‌ టైమ్‌లో ఏదైనా మూవీ ప్రమోషన్‌ను ప్లాన్‌ చేస్తే ఆడియన్స్‌కు అది బాగా రీచ్‌ అవుతుందని అంటారు. అందుకే పండగ సీజన్లో సినిమాను రిలీజ్‌ చేసేందుకు ఆయా సినిమాల నిర్మాతలు పోటీపడుతుంటారు. అలాగే సెట్స్‌పై ఉన్న సినిమావాళ్లు కొత్తలుక్, టీజర్, ట్రైలర్‌ అంటూ ఇలా ఏౖవైనా అప్‌డేట్‌లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్స్‌ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ న్యూ ఇయర్‌ సీజన్‌లో సందడి చేయడానికి ఆయా సినిమా బృందాలు రెడీ అవుతున్నాయి.

‘మహర్షి’ సినిమాలో మహేశ్‌బాబు ఫస్ట్‌ లుక్‌ ఆయన బర్త్‌డే సందర్భంగా రిలీజైన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను 2019 జనవరి 1న రిలీజ్‌ చేసి ఆడియన్స్‌కు న్యూ ఇయర్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట ‘మహర్షి’ యూనిట్‌. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్రధారి. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

ఇన్ని రోజులూ తన నెక్ట్స్‌ చిత్రం గురించి మౌనంగా ఉన్న అల్లు అర్జున్‌ ఈ న్యూ ఇయర్‌కు ఆ మౌనాన్ని బ్రేక్‌ చేయనున్నారు. కొత్త ఏడాది కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నారు. 2019 జనవరి 1న అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. దీంతో అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ చిత్రానికి దర్శకుడు ఎవరు? అనే విషయంపై కూడా క్లారిటీ వస్తుంది. దర్శకులు త్రివిక్రమ్, ‘గీతగోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. హీరో నాని కూడా రెడీ అవుతున్నారు. అయితే అది కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్‌ కాదు. కొత్త లుక్‌తో అన్నమాట. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘జెర్సీ’.

క్రికెటర్‌ అర్జున్‌ పాత్రలో నటిస్తున్నారాయన. ఈ జనవరి 1న అర్జున్‌ లుక్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. ఇక కోలీవుడ్‌లో సూర్య హీరోగా కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకు ఆల్రెడీ మూడు టైటిల్స్‌ను రెడీ చేశారు. వాటిలో ఏ టైటిల్‌ ఫైనల్‌ అనేది 2019 జనవరి 1నే తెలియనుంది. ఇంకా మరికొన్ని చిత్రబృందాలు న్యూ ఇయర్‌కు తమ సినిమాల గురించిన అప్‌డేట్స్‌ను అందించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement