
విజయ్
కోలీవుడ్‌లో రెండు రోజులుగా సినిమాల పరంగా నటుడు విజయ్ గురించే బాగా చర్చించుకుంటున్నారు. విజయ్ నెక్ట్స్ చిత్రదర్శకుడు ఎవరు? అన్నది ఆ చర్చ సారాంశం. కొంతమంది ప్రముఖ దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికి ప్రధానంగా లోకేష్ కనకరాజ్ అనే యువదర్శకుడి పేరు రిపీట్ మోడ్‌లో వినిపిస్తోంది. ‘మా నగరం, అవియల్’ వంటి సినిమాలను తెరకెక్కించిన కనకరాజ్ ప్రస్తుతం కార్తీ హీరోగా ‘ఖైదీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ యువదర్శకుడికి విజయ్ అవకాశం ఇస్తారా? లెటజ్... వెయిట్ అండ్ సీ. ఇక విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.