‘సింగరేణి పోరగాళ్ల కథే ‘పరేషాన్’. మంచిర్యాల ఊరుని ఒక బయోపిక్‌లా తీస్తే మా సినిమా అవుతుంది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సహజమైన వినోదం ఉంటుంది’’ అని హీరో తిరువీర్ అన్నారు. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వంలో ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది.
(చదవండి: త్వరలో భోళా మానియా)
ఈ సందర్భంగా తిరువీర్ మాట్లాడుతూ– ‘‘నేను ఎలాంటి సినిమాలు చేయాలనుకున్నానో అనుకోకుండా ఘాజీ, మల్లేశం, పలాస.. అలాంటివే కుదిరాయి. ‘మసూద’ తర్వాత ఒక స్వేచ్ఛ దొరకడంతో ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను. ఎలాగైనా ‘పరేషాన్’ని జనాల్లోకి తీసుకెళ్దామని రానాగారు ముందుకు రావడంతో మా సినిమాకి బలం వచ్చింది. ప్రస్తుతం శివం సెల్యులాయిడ్ నిర్మాణంలో ఓ సినిమా, ‘బటర్ ఫ్లై’ ఫేం సతీష్‌గారితో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment