Pareshan Movie OTT Release Date - Sakshi
Sakshi News home page

Pareshan In OTT: 'పరేషాన్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే

Jul 20 2023 6:49 PM | Updated on Jul 20 2023 6:56 PM

Pareshan Movie OTT Release Date - Sakshi

సాధారణంగా ఓటీటీల్లోకి ఏ సినిమా అయినా వీలైనంత త్వరగానే వచ్చేస్తుంటాయి. భారీ బడ్జెట్ చిత్రాలైతే కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతుంటాయి కానీ చిన్న మూవీస్ అయితే నెలలోపే స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేసుకుంటూ ఉంటాయి. రానా సమర్పణలో వచ్చిన 'పరేషాన్' మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది.

(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్)

స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
'మసూద' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తిరువీర్ ఇందులో హీరోగా నటించారు. మిగతా వాళ్లందరూ చాలావరకు కొత్త నటీనటులే. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమా జూన్ 2న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో చాలామంది ఈ మూవీ గురించి మర్చిపోయారు. అలాంటి ఆగస్టు 4 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.

'పరేషాన్' కథేంటి?
మంచిర్యాలలో జులాయిగా తిరిగే కుర్రాడు ఐజాక్(తిరువీర్). తన జాబ్ కోసం దాచుకున్న డబ్బుల్ని ఫ్రెండ్‌కి ఇచ్చి సహాయపడే రకం. ఓ రోజు ఊరిలో జరిగిన పెళ్లిలో శిరీష(పావని)ని చూసి లవ్‌లో పడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. వారం తిరక్కుండానే ఆమెకు వాంతులవుతాయి. దీంతో ఇద్దరూ పరేషాన్ అవుతారు. హైదరాబాద్ వెళ్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుందామని అనుకుంటారు. మరి ఐజాక్-శిరీషల పరిస్థితి ఏమైంది? చివరకు ఏం జరిగిందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement