ఎవరైనా ప్రపోజ్ చేశారా?.‍. హీరోయిన్ శ్రీలీల క్రేజీ కామెంట్స్? | Tollywood Actress Sreeleela Crazy Comments About Love Proposal | Sakshi
Sakshi News home page

Sreeleela: ఆ రోజు లవ్ ప్రపోజల్‌ ఉంటుందేమో.. శ్రీలీల కామెంట్స్ వైరల్!

Published Sun, Aug 27 2023 12:20 PM | Last Updated on Sun, Aug 27 2023 1:04 PM

Tollywood Actress Sreeleela Crazy Comments About Love Proposal - Sakshi

పెళ్లిసందడి ఫేమ్, టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్​ బ్యూటీ  శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా తర్వాత రవితేజ సరసన ధమాకాతో అదరగొట్టింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ అయిపోయింది ముద్దుగుమ్మ. తాజాగా రామ్ సరసన స్కంద చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహించారు. శనివారం ఈ చిత్రానికి స్కంద ప్రీ రిలీజ్​ థండర్​ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొని సందడి చేశారు. అయితే ఈవెంట్‌కు యాంకర్‌గా వ్యవహరించిన సుమ హీరోయిన్‌ శ్రీలీలకు ఆసక్తికర ప్రశ్న వేసింది. అదేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

(ఇది చదవండి: బాయ్‌ ఫ్రెండ్‌ వల్ల నరకం అనుభవించాను: రోహిణి)

స్కంద ప్రీ రిలీజ్​ థండర్​ ఈవెంట్‌​లో శ్రీలీలను యాంకర్ సుమ ప్రశ్నించింది. మీకు ఇప్పటిదాకా మీకేమైనా లవ్ ప్రపోజల్స్ వచ్చాయా అని నవ్వుతూ అడిగింది. ఆ ప్రశ్నకు తనదైన శైలిలోనే సమాధానమిచ్చింది పెళ్లిసందడి భామ. ఇప్పటి వరకైతే రాలేదు కానీ.. సెప్టెంబర్‌ 15న రావొచ్చేమో.. ఫన్నీగా ఆన్సరిచ్చింది. ఎందుకంటే ఆ రోజునే రామ్- శ్రీలీల స్కంద మూవీ రిలీజ్ కానుంది. 

బాలయ్య గురించి మాట్లాడుతూ..'అంతేకాకుండా బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన గురించి చాలా చెప్పాలని ఉంది.  కానీ వచ్చేనెలలో జరిగే మరో ఈవెంట్‌లో వెల్లడిస్తాననని చెప్పుకొచ్చింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నేను.. రామ్‌తో కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. హీరో శ్రీకాంత్‌కు మా ఇంట్లో వాళ్లందరు ఫ్యాన్స్. ఆయన సినిమా టైటిల్‌తోనే నేను కెరీర్‌ గురించి ప్రారభించా. థ్యాంక్ యూ శ్రీకాంత్.' అంటూ చెప్పుకొచ్చింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

(ఇది చదవండి: రామ్‌ 'స్కంద' ట్రైలర్‌ విడుదల.. బోయపాటి మాస్ మార్క్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement