Its Confirmed: Srikanth Son Roshann Next Movie With Vyjayanthi Movies, Deets Inside - Sakshi
Sakshi News home page

Roshan: బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌

Published Sun, Mar 13 2022 5:37 PM | Last Updated on Sun, Mar 13 2022 7:11 PM

Hero Srikanth Son Roshan Next Film With Vyjayanthi Movies - Sakshi

Hero Srikanth Son Roshan Next Film With Vyjayanthi Movies: నిర్మల కాన్వెంట్‌ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు రోషన్. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్‌ తీసుకొని పెళ్లి సందD సినిమాలో నటించాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయం అందుకోలేకపోయినా రోషన్‌ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస ఆఫర్లు వస్తున్నా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ ప్ర‌దీప్ అద్వైతం ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, స్వ‌ప్నా సినిమాస్ ఈ చిత్రానికి స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. ఈ విషయాన్ని ఆదివారం(మార్చి13)న రోషన్‌ బర్త్‌డే సందర్భంగా  వైజయంతి మూవీస్‌ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement