
సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన డిగ్రీ విద్యార్థిని రవళి మృతి చెందిడంతో ఆమె తండ్రి సుధాకర్ కన్నీరు మున్నీరయ్యారు. కూతురుని ఎంతో గారాభంగా పెంచుకున్నానని.. అలాంటి తన కూతురుని అన్వేష్ పొట్టన బెట్టుకున్నాడని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన ఒక్కగానొక్క కూతురుని అకారణంగా చంపేశాడని.. అన్వేష్‌ను కూడా పెట్రోల్ పోసి చంపేయాలని డిమాండ్ చేశారు. అన్వేష్ తన కూతురుని చాలా రోజుల నుంచి వేధించాడని, పోలీసులు అన్వేష్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. ఆరు రోజులు మృత్యువుతో పోరాడి.. చివరకు ప్రాణాలు విడిచిందని వాపోయారు. రేపు రవళి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.
చదవండి :
Comments
Please login to add a commentAdd a comment