
సాక్షి, గుంటూరు : చిలకలూరిపేట మండలం తాతపూడికొండలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్‌లోని విద్యుత్ దీపాలు రిపేర్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మౌలాలీ, శేఖర్, శ్రీనివాసరావు అనే ముగ్గురు కార్మికులు మరణించారు. విద్యుత్ దీపాలను బాగు చేసేందుకు ఐరన్ స్టాండ్‌ను తీసుకెళ్తుండగా.. అది 11 కేవీ విద్యుత్ లైన్‌కు తగలడంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు.