పండగపూట పెను విషాదం | Three People Die From Electrocution In Guntur | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Published Thu, Sep 13 2018 11:40 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Three People Die From Electrocution In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: ఇంట్లో కేబుల్‌ వైరు లాగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌కు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ హృదయవిదారక ఘటన గురువారం ఉదయం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడిలో చోటు చేసుకుంది. మృతిచెందిన వారిలో ఏసు(26), సాల్మన్‌ రాజు(5), ఎస్తేరు(3) వున్నారు. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన ఏసు తన కుటుంబంతో కలిసి బుధవారం బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యాడు.

కొత్త ఇంట్లోకి కేబుల్‌ వైరు లాగుతున్న సందర్భంలో ఏసు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. ఈ విషయం తెలియని పిల్లలు తండ్రిని పట్టుకోవడంతో వారికి కూడా షాక్‌ తగిలింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్‌షాక్‌కు గల కారణాలు తెలియాల్సివుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో గనికపూడి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement