![Actress Ravali Interesting Comments In Pelli SandaDI Pre Release Event - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/11/ravali.jpg.webp?itok=RihAr5eu)
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్లి సందD’. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న(అక్టోబర్ 10) పెళ్లి సందD ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరి వెంకటేశ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే 25 ఏళ్ల శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలో కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కిచిన నాటి పెళ్లి సందడి హీరో, హీరోయిన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చదవండి: రకుల్ పెళ్లి చేసుకోబోయే ఈ జాకీ భగ్నానీ ఎవరో తెలుసా!
ఈ వేడుకలో ఒకప్పుటి హీరోయిన్ రవళిని చూసి అందరూ షాక్ అయ్యారు. అలాగే అతిథులుగా వచ్చిన చిరు, వెంకటేశ్‌లు సైతం ఆమెను చూసి అవాక్కయ్యారు. తన అందం, అభినయంతో 90లలో హీరోయిన్‌గా చక్రం తిప్పిన రవళి ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. అంతేగాక తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె ఇప్పుడు ఓవర్ వెయిట్‌తో బొద్దుగా ఎవరూ గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఈ కార్యక్రమంలో ఆమె స్టేజ్‌పై మాట్లాడుతూ ముందుగా ‘నా పేరు రవళి’ అంటూ చిరంజీవి, వెంకటేశ్‌లకు తనని తాను పరిచయం చేసుకున్నారు. అంతేగాక తనని గుర్తు పట్టి ఉండరేమో.. అందుకే పరిచయం చేసుకుంటున్నాను అంటూ సరదాగా చమత్కరించారు.
చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న రకుల్!, వరుడు ఎవరంటే..
ఆ తర్వాత రవళి మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. సాధారణంగా నేను ఈ మధ్య ఎలాంటి ఫంక్షన్స్‌కు, మూవీ ఈవెంట్స్‌కు రావడం లేదు. రావొద్దని కాదు కానీ.. వచ్చిన నన్ను ఎవరూ గుర్తుపట్టడం లేదు. అందుకే ఈవెంట్స్‌కు రావడం మానేశాను. అయినా రాఘవేంద్ర రావు పిలిచిన తర్వాత రాకుండా ఉండలేను, ఏ స్టేజ్‌లో ఉన్నా.. ఎలా ఉన్నా వస్తాను’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. అనంతరం ఆమె పెళ్లి సందD హీరో రోషన్, శ్రీలీలా, మూవీ టీంకు ఆమె అభినందనలు తెలిపారు. కాగా కె రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో గౌరి రోనంకి ఈ మూవీని రూపొందించారు. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment