
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజాతో పాటు హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వాహనాలతో కిక్కిరిసిపోయింది.
యాదాద్రితో పాటు స్వర్ణగిరికి భక్తులు భారీగా తరలిరాగా, శుభకార్యాలు కూడా ఎక్కువగా ఉండడంతో 40వేల వరకు వాహనాలు గూడూరు టోల్‌ప్లాజా గుండా రాకపోకలు సాగించాయి. టోల్‌ప్లాజా వద్ద గూడూరు నుంచి పగిడిపల్లి వరకు వాహనాలు బారులుదీరాయి.