
సాక్షి, తిరుపతి: నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. గూడూరు జంక్షన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పింది.
అహ్మదాబాద్ నుండి చెన్నై వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్‌లోని పాంట్రీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది.. గూడూరు రైల్వే స్టేషన్‌లో రైలు ఆపి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం కారణంగా.. గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్‌లోనే రైలు నిలిచిపోయింది.
ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న రైల్వే అధికారులు. ఘటనపై అధికారుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment