చెన్నై నుంచి హౌరా వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. రైలు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం గోదారిపేట సమీపంలోకి రాగానే ఈ ఘటన జరిగింది. ఓ బోగీ నుంచి పొగలు, సన్నని మంటలు వచ్చినట్టు గుర్తించడంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే రైలును ఆపేశారు. వాటిని ఆర్పివేసిన తర్వాత అరగంట ఆలస్యంగా రైలు బయల్దేరింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
చెన్నై- హౌరా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
Published Sat, May 21 2016 5:17 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement