రాష్ట్రస్థాయి పోటీలకు వాలీబాల్ జట్ల ఎంపిక
రాష్ట్రస్థాయి పోటీలకు వాలీబాల్ జట్ల ఎంపిక
Published Sun, Sep 18 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
గూడూరు: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా సీనియర్ వాలీబాల్ జట్లను ఆదివారం ఎంపిక చేశారు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగిన పురుషుల జట్టు ఎంపికలకు 50 మంది క్రీడాకారులు హాజరవగా, అత్యుత్తమ ప్రతిభకనబర్చిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. అలాగే డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో జరిగిన మహిళల జట్టు ఎంపికకు 32 మంది క్రీడాకారిణిలు హాజరవగా, బాగా రాణించిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కమలాకర్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ శ్రీనివాసులురెడ్డి, హరిచంద్రారెడ్డి, క్రికెట్ క్లబ్ చైర్మన్ మునిగిరీష్, రాష్ట్ర వ్యాయామ ఉపాద్యాయుల సంఘం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, పీడీ సురేంద్రరెడ్డి, డీఆర్‌డబ్ల్యూ వ్యాయామ అధ్యాపకురాలు విజయకళ, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement